Police Action: బెట్టింగ్‌ యాప్‌లపై ఫైటింగ్‌!

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 19 , 2025 | 04:05 AM

బెట్టింగ్‌ యాప్‌లకు వ్యతిరేకంగా సీనియర్‌ ఐపీఎస్‌, టీజీఎ్‌సఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించిన ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. మోసపూరిత యాప్‌ల తరఫున ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా..

 Police Action: బెట్టింగ్‌ యాప్‌లపై ఫైటింగ్‌!

  • సోషల్‌ మీడియాలో భారీ స్పందన

  • ఇన్‌ఫ్లుయెన్సర్లూ జాగ్రత్త

  • కాసులకు కక్కుర్తిపడి మోసపూరిత

  • యాప్‌లకు ప్రచారం చేస్తే కటకటాలే

  • ఒకే రోజు 11 మందిపై కేసులు.. నోటీసులు

  • మంచు లక్ష్మిపైనా కేసుకు రంగం సిద్ధం?

  • కేసుల భయంతో దిగొస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు

  • ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు!

  • ‘సే నో టూ బెట్టింగ్‌ యాప్స్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో బెట్టింగ్‌ నివారణ ఉద్యమం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్‌లకు వ్యతిరేకంగా సీనియర్‌ ఐపీఎస్‌, టీజీఎ్‌సఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించిన ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. మోసపూరిత యాప్‌ల తరఫున ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవుతున్నాయి. ‘‘భారత ఆర్థిక వ్యవస్థను, యువత భవిష్యత్తును ధ్వంసం చేస్తున్న బెట్టింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండండి. కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్‌ ఇచ్చిన పిలుపునకు ఫలితం వస్తోంది. ‘సే నో టూ బెట్టింగ్‌ యాప్స్‌’ హ్యాష్‌ ట్యాగ్‌తో బెట్టింగ్‌ నివారణ ఉద్యమాన్ని కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ‘‘ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతీ అక్కర్లేదు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటే ఇలానే ముందుకు సాగండి. మనమంతా కలిసి సోషల్‌ మీడియాలో బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారానికి వ్యతిరేకంగా పోరాడదాం. అనేక మంది ప్రాణాలను కాపాడదాం. ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేయండి’’ అనేసజ్జనార్‌ మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఫలితంగా మోసపూరిత యాప్‌లకు ప్రచారం చేస్తున్న 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఒకేరోజు పోలీసులు కేసులు నమోదు చేశారు. సజ్జనార్‌ తాజా ఉద్యమంతో ఇన్‌ఫ్లూయెన్సర్లు దిగొచ్చారు. ఇకపై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం చేయబోమని ప్రకటిస్తున్నారు.

ప్రమోషన్లతో సంపాదన ఇలా..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా రు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. దీంతో కొం దరు డబ్బు సంపాదనకు దీన్ని సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. అదేసమయంలో వారి ప్రచా రం చూసి.. బెట్టింగ్‌ యాప్‌ల్లో డబ్బులు పెట్టి సర్వం కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తర్వాత రుణ భారం ఎక్కువ కావడంతో తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. ఈ యాప్‌ల్లో ఓ వ్యక్తి చేసిన డిపాజిట్‌పై పర్సంటేజీలు, కమీషన్లను ప్రమోటర్లకు ఇస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా కొందరు రోజుకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ద్వారా ఎంత ఎక్కువ మందితో డిపాజిట్‌ చేయిస్తే అంత ఎక్కువ కమీషన్‌ వస్తుంది. దీంతో ఎక్కువమంది ఈ యాప్‌లకు ప్రచారం చేస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు చాలామంది టెలిగ్రామ్‌లో గ్రూపులు సృష్టిస్తున్నారు. తర్వాత ఆ గ్రూపులో బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారు. మొదట యాప్‌లో జాయిన్‌ అయితే బోనస్‌ వస్తుందంటూ బెట్టింగ్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ అయ్యేలా ఆకర్షిస్తుంటారు.

నటి మంచు లక్ష్మి ప్రమోషన్‌

కొందరు సినీ నటులు కూడా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నారు. తాజాగా నటి మంచు లక్ష్మి యోలో24/7 యాప్‌ను ప్రమోట్‌ చేసినట్లు వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఆమెపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Updated Date – Mar 19 , 2025 | 04:06 AM

Google News

Subscribe for notification