- సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం
- పీఎం సహాయ నిధి నుంచి రూ.2లక్షలు ప్రకటన

సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇక పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: సింహాచలం ఘటనపై చంద్రబాబు విచారం.. మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: సింహాచలం ఘటన దురదృష్టకరం
చంద్రబాబు ఆదేశం
ఇక క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25లక్షల చొప్పున సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.3లక్షల పరిహారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు.
#WATCH | Andhra Pradesh | Visuals from the Sri Varahalakshmi Narasimha Swamy temple in Visakhapatnam, where seven people died after a 20-foot-long stretch collapsed during the Chandanotsavam festival pic.twitter.com/q7CWB4vfJr
— ANI (@ANI) April 30, 2025