PM Modi addressed the Lok Sabha on Prayagraj Maha Kumbh

Written by RAJU

Published on:

  • దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది
  • భారత శక్తి ప్రపంచానికి తెలిసింది
  • లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ
PM Modi addressed the Lok Sabha on Prayagraj Maha Kumbh

దేశ ప్రజల సహకారంతో మహా కుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోడీ ప్రసగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: AP Assembly 2025: విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు: మంత్రి లోకేష్

‘‘కుంభమేళా భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఇదొక చారిత్రక ఘట్టం. యువత కూడా ఉత్సాహంగా కుంభమేళాలో పాల్గొంది. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలు.. కుంభమేళాతో పటాపంచలయ్యాయి.’’ అని మోడీ అన్నారు.

మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా కుంభమేళా ముగిసింది. ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.

ఇది కూడా చదవండి: Israel: గాజాతో పాటు సిరియా, లెబనాన్‌పై కూడా ఐడీఎఫ్ దాడి.. 10 మంది మృతి

Subscribe for notification