ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యం ఫలిస్తోంది.. శ్రీలంకలో పర్యటించిన మరుసటి రోజే.. ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. సముద్ర సరిహద్దును దాటినందుకు అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల సమస్యను పరిష్కరించడంలో మానవతా దృక్పథాన్ని అవలంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు.. ఈ క్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, సూచనలకు అనుగుణంగా శ్రీలంక ఆదివారం 14 మంది భారతీయ జాలర్లను విడుదల చేసింది. కాగా.. ప్రధాని మోదీ శ్రీలంకలో శనివారం, ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ – శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే మధ్య పలు విషయాలపై చర్చ జరిగింది.. అంతేకాకుండా దౌత్యపరమైన విషయాలు, ఒప్పందాలపై కూడా ఇరు దేశాధినేతలు సంతాకాలు చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ – శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే చారిత్రాత్మక నగరమైన అనురాధపురలో పర్యటించి, భారతదేశ మద్దతుతో కూడిన రెండు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించారు.. ఆ తర్వాత ప్రధాని మోదీ భారత్ కు చేరుకున్నారు.. మోదీ దౌత్యం అనంతరం శ్రీలంక ప్రభుత్వం భారత జాలర్లను విడుదల చేసింది.. శనివారం ప్రధాని మోదీ – శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే మధ్య జరిగిన చర్చలలో మత్స్యకారుల అంశం ప్రస్తావనకు వచ్చింది.. దీని ఫలితంగా విభిన్న రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి అనేక ఒప్పందాలు కుదిరాయి.
శ్రీలంక అధికారిక గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం ద్వీప దేశ జలాల్లో వేటాడారనే ఆరోపణలపై దాదాపు 140 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసి, వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశం రాజకీయంగా సున్నితమైనది.. తమిళనాడు ప్రభుత్వం శ్రీలంక అధికారులతో మత్స్యకారుల విడుదలను చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది.
శనివారం కొలంబోలో దిస్సనాయకేతో జరిగిన మీడియా సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని అన్నారు. “ఈ విషయంలో మనం మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని మేము అంగీకరించాము” అని మోదీ చెప్పారు. ” మత్స్యకారులను వారి పడవలను వెంటనే విడుదల చేయాలని కూడా మేము నొక్కి చెప్పాము” అని మోదీ పేర్కొన్నారు.
రెండు దేశాలను వేరు చేసే ఇరుకైన జలసంధి అయిన పాక్ జలసంధిలో శ్రీలంక నావికాదళ సిబ్బంది బలప్రయోగం లేదా కాల్పులు జరిపిన కొన్ని సంఘటనల తర్వాత భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న విషయం వివాదాస్పదంగా మారింది. జనవరిలో శ్రీలంక నావికాదళం ఒక జాలర్లను పట్టుకునే సమయంలో కాల్పులు జరపడంతో ఐదుగురు భారతీయ జాలర్లకు గాయాలైన తర్వాత భారతదేశం దౌత్యపరమైన నిరసనను వ్యక్తం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..