PM Internship Scheme 2025 Registration : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2025 దరఖాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ తేదీని పొడింగించారు. తాజాగా మొబైల్ యాప్ సైతం విడుదల చేశారు.

ఈ పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్నెట్ షిప్ అవకాశాలను కల్పించాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువత తమకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకునేందుకు, పరిశ్రమలతో కలిసి పని చేసేందుకు ఈ స్కీమ్ ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగుపడనున్నాయి.
2024 అక్టోబర్ 3న ఈ ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మొత్తం 327 కంపెనీలు లక్షకుపైగా ఇంటర్న్ షిప్ అవకాశాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేది. అయితే ఇంటర్న్ షిప్ సమయంలో పలు కంపెనీలు స్టైఫెండ్ అందిస్తాయి. ఇంటర్న్ షిప్ అనంతరం సర్టిఫికేట్ (PM Internship Certificate) సైతం లభిస్తుంది.
ఈ పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కి ఎంపికైన అభ్యర్ధులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైపెండ్ ఇస్తారు. దీనితో పాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్‌టైం గ్రాంట్) కూడా చెల్లిస్తారు. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్ రూం శిక్షణ.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్‌లో శిక్షణ ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
How to apply for PM Internship Scheme
- మొదట మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి PM Internship Scheme అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఆపిల్ ఐఫోన్ వాడుతున్నట్లయితే ఐవోఎస్ స్టోర్ లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం మీ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ పేరు విద్యార్హతలు చిరునామా వంటి వివరాలను తెలపాలి.
- తర్వారత యాప్ లోపలికి ప్రవేశించి Internship Opportunities అనే విభాగాన్ని ఓపెన్ చేయాలి.
- ఇందులో మీరు మీ విద్యార్హత, మీ ఆసక్తిని బట్టి ఇంటర్న్‌షిప్‌లను బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది.
- మీకు నచ్చిన ఇంటర్న్‌షిప్ క్లిక్ చేసిన తర్వాత Apply Now బటన్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. (ఆధార్ కార్డు, టెన్త్, డిగ్రీ సర్టిఫికెట్స్, బయోడేటా, అలాగే పాస్ పోర్ట్ సైజు ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది)
- ఇప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే.. ముందుగా యాప్ లోని My Applications సెక్షన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- అలాగే ఎవరైతే ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ అయ్యారో వారికి నోటిఫికేషన్ రూపంలో సమాచారం తెలుస్తుంది.
- ఇక ఎంపికైన విద్యార్థులకు మీరు అప్లయ్ చేసిన కంపెనీ నుంచి ఈమెయిల్ రూపంలో కానీ కాల్ రూపంలో కానీ సమాచారం అందుతుంది.