ఇంటర్నెట్ డెస్క్: పళ్లు, కూరగాయలు తరిగేందుకు చాలా మంది చెక్క బోర్డును వాడుతుంటారు. ప్లాస్టిక్ బోర్డుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలడంతో అనేక మంది చెక్క బోర్డుల వైపు మళ్లారు. అయితే, వీటితో కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చెక్క బోర్డుల్లో సూక్ష్మ రంధ్రాలు అనేకం ఉంటాయి. ఫలితంగా ఈ బోర్డుల్లోకి కూరగాయల్లోని నీరు చేరుతుంది. ఈ తేమ కారణంగా క్రమంగా సూక్ష్మ క్రిములు పెరుగుతాయి. కాలం గడిచేకొద్దీ బోర్డుల్లో చిన్న చిన్న పగుళ్లు ఏర్పడి చెత్త కూడా పేరుకుపోతుంది. వీటిని శుభ్రం చేయడం కష్టతరంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో బోర్డులపై హానికారక సాల్మొనెల్లా, ఈకొలై, లిస్టేరియా వంటి క్రిములు వచ్చి చేరతాయి. అంతేకాకుండా, కాలం గడుస్తున్న కొద్దీ చెక్క బోర్డులపై ఉన్న చిన్న చిన్న చెక్క ముక్కలు ఆహారంలో కూడా కలుస్తాయి. ఇవి కడుపులోకి వెళితే అనేక సమస్యలు చుట్టుముడతాయి (Health).
Immunotherapy: క్యాన్సర్ చికిత్సలో ఈ అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసా?
సరిగా శుభ్ర పరచని చెక్క బోర్డుల కారణంగా శరీరంలోకి వ్యాధికారక సూక్ష్మక్రియులు చేరతాయి. ఇవి జ్వరం, డయేరియా, వాంతులు, ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు కలుగజేస్తాయి. చిన్నారులు, వృద్ధులకు చెక్క బోర్డులతో సమస్యలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
కడుపులోకి చేరే సూక్ష్మ చెక్క ముక్కలతో పేగులకు ఇబ్బంది కలగొచ్చు.
మాసాంహారం మొదలు పళ్లు, కూరగాయల వరకూ అన్నింటినీ తరిగేందుకు చాలా మంది ఒకే బో్డును వాడుతుంటారు. దీని ద్వారా హానికారక బ్యాక్టీరియా ఒక ఆహారం నుంచి మరో ఆహారం ద్వారా శరీరంలో చేరి వ్యాధిని కలుగజేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Hormonal Balance: శరీరంలో హార్మోన్‌ల సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన పద్ధతులు!
కాబట్టి చెక్క బోర్డులకు బదులుగా వెదురు, గ్లాస్ లేదా అక్రిలిక్, స్టీల్ బోర్డులు వాడితే ఈ సమస్యలేవీ రావని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్టీల్ బోర్డులకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగిందట. సులువుగా శుభ్రం చేయగలగడంతో పాటు వీటిల్లో మలినాలు చేరే ఆస్కారం లేకపోవడంతో ఇటీవల కాలంలో అనేక మంది స్టీల్ బోర్డుల వైపు మళ్లుతున్నారట.
Read Latest and Health News