peddapally : కొత్త పింఛన్లు ఇచ్చేదెప్పుడో….?

Written by RAJU

Published on:

– వృద్ధులు చనిపోతే కుటుంబంలో ఒకరికి పింఛన్‌

– ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం

– వలస వెళ్లిన వారి గురించి ఆరా..

– కొత్త పింఛన్ల కోసం అనేక మంది నిరీక్షణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

చేయూత పథకంపై ఆశలు పెంచుకున్న ఆశావ హుల ఆశలు ఇప్పట్లో నెరవెరేలా కనబడడం లేదు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఆయా కుటుంబాల్లో పింఛన్‌ పొందుతున్న వృద్ధులు చనిపోతే, ఆ కుటుం బంలో అర్హత గల వారికి వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వృద్ధుల వివరాలను సేకరిం చే పనిలో సెర్ఫ్‌ అధికారులు, సిబ్బంది నిమగ్నమ య్యారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గీత కార్మికులు, తది తర వర్గాలకు చెందిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్‌ పథకాన్ని కొనసాగిస్తున్నాయి.

జిల్లాలో పింఛన్లు ఇలా..

జిల్లాలో వృద్ధాప్య 40,884 మంది, వితంతు 32,903 మంది, దివ్యాంగులు 13,068 మంది, చేనేత 806 మంది, గీత కార్మికులు 2187 మంది, బీడీ కార్మికులు 695 మంది, ఒంటరి మహిళలు 2,613 మంది, టేకేదార్‌లు ఐదుగురు, ఫైలేరియా బాధితులు 338 మంది, డయాలిస్‌ బాధితులు 83 మంది, ఇతరులు 1253 మంది, మొత్తం 94,835 మందికి పిఃఛన్లు ఇస్తున్నారు. ఈ పథకం కింద దివ్యాంగులకు నెలకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 ఇస్తున్నారు.

ఫ పదిహేను నెలలుగా కొత్త పింఛన్ల ఊసే లేదు..

తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకా లను అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఆ గ్యారంటీ పథకాల్లో ఒకటైన చేయూత పథకం కింద ఫింఛన్ల సొమ్మును డబుల్‌ చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన గ్రామ, పట్టణ సభల ద్వారా ఆరు గ్యారం టీ పథకాల కింద ప్రజల నుంచి ప్రభుత్వం దరఖా స్తులను స్వీకరించింది. అందులో భాగంగా చేయూత పథకం కింద దివ్యాంగుల పింఛన్‌ కోసం 6.979 మంది, ఇతరులు 49,552 మంది, మొత్తం 56,531 మంది పిం ఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పదిహేను నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. ఉన్న పింఛన్‌దారుల్లో దివ్యాం గులకు నెలకు 6 వేలు, ఇతరులకు 4 వేల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అమలు చేయలేదు. కొత్త పింఛన్ల కోసం అనేక మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అధికా రుల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాం లో ఐదేళ్లలో 2022లో ఒకసారి మాత్రమే జిల్లాలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేశారు. అప్పటి నుంచి కొత్త పింఛన్లు ఇచ్చిన దాఖలాలు కనబడడం లేదు. ఫించన్ల మంజూరు విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలది ఒకే వైఖరిగా కనబడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.

ఫ వృద్ధులు మరణిస్తేనే మరొకరికి పింఛన్‌..

తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖాధికారులు వృద్ధాప్య పింఛన్‌దారులు మరణిస్తే, వారి కుటుంబంలో భార్యకు గానీ, భర్తకు గానీ లేదా అర్హులైన ఇతరులకు వెంటనే ఫించన్‌ మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో మరణించిన వృద్ధుల వివరాలను, వారి కుటుంబంలో అర్హులైన వారి వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించాలని డీఆర్‌డీ అధికారి సెర్ఫ్‌ సిబ్బందిని ఆదేశించారు. పోస్టాపీసుల ద్వారా పింఛన్లు పొందుతున్న వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 2,55,262 మంది మూడు మాసాలపాటు పింఛన్‌ తీసుకుని ఆ తర్వాత వలస వెళ్లారని గుర్తించారు. అందులో జిల్లాలో 611 మంది ఉన్నారు. ఇందులో ఎవరైనా మరణించారా, ఏఏ ప్రాంతాలకు వలస వెళ్లారు, తిరిగి ఎప్పుడు వస్తారనే విషయమై ఆరా తీస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరణించిన వృద్ధుల కుటుంబాల్లో మరొకరికి అర్హులైన మంజూరు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఇప్పట్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడం, ఉన్న పింఛన్‌ దారులకు సొమ్ము పెంచే అవకాశాలు కనిపించడం లేదు.

Updated Date – Mar 31 , 2025 | 12:43 AM

Subscribe for notification
Verified by MonsterInsights