PBKS vs CSK Match Consequence: వరుసగా 4వ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?

Written by RAJU

Published on:


Punjab Kings vs Chennai Super Kings, 22nd Match: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ (PBKS)పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకోచ్చింది. వరుసగా నాలుగో ఓటమితో చెన్నై జట్టు 9వ స్థానానికి పడిపోయింది.

మంగళవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే 49 బంతుల్లో 69 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఎంఎస్ ధోని 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. పంజాబ్ తరఫున ప్రియాంష్ ఆర్య 42 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతను 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రియాంష్ కాకుండా, శశాంక్ సింగ్ 52 పరుగులతో, మార్కో జాన్సెన్ 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతిష్ పతిరాణ.

ఇంపాక్ట్ ప్లేయర్స్: శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్.

పంజాబ్ కింగ్స్- శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో యాన్సన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యాంశ్ షెడ్గే, యశ్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్‌కుమార్ వైశాఖ్.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights