Punjab Kings Best Playing 11: ఐపీఎల్ (IPL) 2025 కోసం పంజాబ్ కింగ్స్ జట్టు చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కష్టపడి పనిచేసింది. ఫలితంగా జట్టు ఇప్పుడు టైటిల్ గెలుచుకోవడానికి బలమైన పోటీదారుగా కనిపిస్తోంది. వేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి అతనిని కెప్టెన్‌గా చేసింది. ఇది కాకుండా, జట్టులో గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. వారిద్దరూ ఇంతకు ముందు పంజాబ్ కింగ్స్ తరపున ఆడారు. ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఆటగాళ్ల రాక తర్వాత పంజాబ్ కింగ్స్‌లో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండనుందో ఇఫ్పుడు తెలుసుకుందాం..
3వ స్థానంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్..
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వికెట్ కీపింగ్ పాత్రను కూడా పోషించగలడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లకు ఫుల్ పవర్‌తో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. తమ జట్టు తరపున అద్భుతంగా రాణించగలరు. ఆ తర్వాత, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మూడవ స్థానంలో ఆడుతున్నట్లు కనిపిస్తుంది. IPL 2025 సమయంలో అతను ఈ స్థానంలో ఆడతానని ధృవీకరించాడు. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత అతనిపై ఉంటుంది.
ఆ తర్వాత, నెహాల్ వాధేరా, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్ వంటి బ్యాట్స్ మెన్స్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేయనున్నారు. గత సీజన్ లాగే, ఈసారి కూడా శశాంక్ సింగ్ లోయర్ ఆర్డర్‌లో వచ్చి ఇన్నింగ్స్‌ను ముగించవచ్చు. మరోవైపు, బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, పంజాబ్ కింగ్స్ జట్టులో మార్కో జాన్సెన్, విజయ్ కుమార్ వ్యాస్, అర్ష్ దీప్ సింగ్ రూపంలో ముగ్గురు అద్భుతమైన పేసర్లు ఉన్నారు. గత సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ కూడా జట్టులో ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ బాధ్యత యుజ్వేంద్ర చాహల్ పై ఉంటుంది. ఈసారి అతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నట్లు కనిపిస్తాడు.
ఇవి కూడా చదవండి
బలాలు:
బ్యాటింగ్ లైనప్: పవర్ హిట్టర్లు, సాంకేతికంగా మంచి బ్యాటర్ల బలమైన కలయిక.
నాయకత్వం: శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ అనుభవం, ప్రశాంతమైన ప్రవర్తన, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ నుంచి బలమైన మార్గదర్శకత్వం.
శక్తివంతమైన బౌలింగ్ దాడి: అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్ కలయిక బలీయమైన దాడిని రూపొందిస్తుంది.
ఆల్ రౌండ్ ఎంపికలు: మార్కో జాన్సెన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి ఆటగాళ్ళు రెండు విభాగాలలో కీలకంగా మారనున్నారు.
బలహీనతలు:
టాప్ ఆర్డర్ అనుభవరాహిత్యం: టాప్ ఆర్డర్ అంతగా అనుభవం లేదు. దీంతో పవర్ ప్లేలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు.
విదేశీ ఆల్ రౌండర్లపై ఆధారపడటం: ఫినిషింగ్ విధుల కోసం మాక్స్‌వెల్ మరియు, జాన్సెన్‌లపై ఎక్కువగా ఆధారపడటం.
అవకాశాలు:
కొత్త టీం: కొత్త జట్టుతో, పంజాబ్ కింగ్స్ తమ అండర్ డాగ్ ట్యాగ్‌ను కోల్పోయే అవకాశం ఉంది.
టైటిల్ కరువును తొలగించడం: కొత్త జట్టుతో తమ తొలి IPL టైటిల్ కోసం బలమైన పోటీదారులుగా ఉడడం.
బ్యాకప్ లేకపోవడం: అయ్యర్, మాక్స్‌వెల్ వంటి కీలక ఆటగాళ్లపై అతిగా ఆధారపడటం వల్ల గాయాలు సంభవిస్తే ఎదురుదెబ్బ తగలవచ్చు.
ప్లేఆఫ్ అనుభవం లేకపోవడం: జట్టులో కొంతమంది ఆటగాళ్లకు గణనీయమైన ప్లేఆఫ్ అనుభవం లేదు. ఇది క్లిష్టమైన పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించవచ్చు.
IPL 2025కి పంజాబ్ కింగ్స్ బెస్ట్ ప్లేయింగ్ XI:
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వాధేరా, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వ్యాస్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
IPL 2025 కోసం పంజాబ్ కింగ్స్ స్క్వాడ్..
బ్యాటర్లు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, పైలా అవినాష్, హర్నూర్ సింగ్, నేహాల్ వధేరా
వికెట్ కీపర్లు: జోష్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్
ఆల్ రౌండర్లు: అజ్మతుల్లా ఒమర్జాయ్, ఆరోన్ హార్డీ, మార్కో జాన్సెన్, గ్లెన్ మాక్స్వెల్, ముషీర్ ఖాన్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, సూర్యాంష్ షెడ్జ్
బౌలర్లు: అర్ష్‌దీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర చాహల్, ప్రవీణ్ దూబే, లాకీ ఫెర్గూసన్, హర్‌ప్రీత్ బ్రార్, కుల్దీప్ సేన్, విజయ్‌కుమార్ వ్యాషాక్, యశ్ ఠాకూర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..