Pawan Kalyan: చినబాబు ఆరోగ్యం బాగుండాలి.. త్వరగా కోలుకోవాలి అంటూ రోజా ప్రార్ధన.. – Telugu Information | Roja selvamani reacts ap deputy cm pawan kalyan son singapore faculty hearth incident

Written by RAJU

Published on:

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని, వ్యాలీ షాప్ హౌస్ లో ని స్కూల్ లో చదువుతున్నాడు. ఈ రోజు ఉదయం స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సమయంలో స్కూల్ లో 80 మంది పిల్లలు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించాడు. సుమారు 15 మంది పిల్లలు, నలుగురు పాటశాల సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పవన్‌ కల్యాణ్‌ తనయుడు మార్క్‌ శంకర్‌ కూడా ఉన్నాడు. శంకర్ చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది.

శంకర్ చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదం వలన శంకర్ ఊపిరి తిత్తుల్లో పొగ చేరుకుందని.. వెంటనే శంకర్ ను హాస్పటల్ కి తరలింఛి చికిత్స అందించారని.. ఇప్పుడు శంకర్ బాగానే ఉన్నాడు అని చిరంజీవి తెలిపారు. శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆందోళన చెందాల్సిన పనిలేదని చిరంజీవి తెలిపారు. మరోవైపు ఏపీ మాజీ సిఎం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా .

ఇవి కూడా చదవండి

మార్క్‌ శంకర్‌కు జరిగిన ప్రమాదం గురించి విన్న వెంటనే తన మనసు ఎంతో కలత చెందిందని.. చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్‌ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్‌ చేశారు.

అయితే ప్రస్తుతం అరకు టూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఇక్కడ పర్యటన ముగించుకుని సింగపూర్ వెళ్లనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్ లో ఎందుకు ఉంటున్నాడు అని ఆలోచిస్తున్నారా.. పవన్ భార్య అన్నాలెజ్ నెవ సింగపూర్ లో చదువుకుంటున్నారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. చదువుకోసం వెళ్ళిన తల్లితో పాటు కుమారుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights