Patanjali Healthcare: పతంజలి హెల్త్‌కేర్ వెల్‌నెస్ సెంటర్లు.. ఎలాంటి మందులు లేకుండానే నేచురల్ థెరపీ!

Written by RAJU

Published on:

Patanjali Healthcare: పతంజలి హెల్త్‌కేర్ వెల్‌నెస్ సెంటర్లు.. ఎలాంటి మందులు లేకుండానే నేచురల్ థెరపీ!

Patanjali Healthcare Wellness Centers: నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలుగా మారింది. ఆరోగ్యంకంటే ఏది తక్కువ కాదనే విషయం అందరికి తెలిసిందే. నిరంతరం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ప్రజలను వ్యాధుల వైపు నెడుతున్నాయి. నేటి కాలంలో అల్లోపతి చికిత్స అధిక ఖర్చు, దుష్ప్రభావాలు చూసి ప్రజలు సహజ, ఆయుర్వేద చికిత్సల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అటువంటి పరిస్థితిలో పతంజలి హెల్త్‌కేర్ సహజ, ఆయుర్వేద పద్ధతుల ద్వారా ప్రజలను ఆరోగ్యంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

బాబా రామ్‌దేవ్ నాయకత్వంలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను అందించడమే కాకుండా వెల్‌నెస్ సెంటర్లు, నేచురల్ థెరపీ సెంటర్ల ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి కూడా సహాయం చేస్తోంది. ఇక్కడ ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స అందుబాటులో ఉంది. అందుకే ప్రజలు మందులపై ఆధారపడకుండా సహజ పద్ధతుల ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

పతంజలి వెల్నెస్ సెంటర్ అంటే ఏమిటి?

పతంజలి వెల్నెస్ సెంటర్ లక్ష్యం ప్రజలను సహజమైన పద్ధతిలో ఆరోగ్యవంతులుగా చేయడమే. ఇక్కడ యోగా, ధ్యానం, పంచకర్మ, ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్స జరుగుతుంది. ఈ కేంద్రాలకు వచ్చే వ్యక్తులు ఎటువంటి శస్త్రచికిత్స లేదా మందులు లేకుండానే సహజమైన, సురక్షితమైన మార్గంలో చికిత్స పొందవచ్చు. ఇక్కడ ప్రతి వ్యక్తి శారీరక స్థితిని బట్టి నిపుణులచే చికిత్స అందిస్తారు. చాలా మంది ఒత్తిడి, నిద్రలేమి, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. పతంజలి వెల్నెస్ సెంటర్‌లో ఈ వ్యాధులన్నీ యోగా, ఆయుర్వేదం, సహజ చికిత్స ద్వారా చికిత్స పొందుతాయి.

పతంజలి నేచురల్ థెరపీ సెంటర్ ఎలా పనిచేస్తుంది?

పతంజలి హెల్త్‌కేర్ కింద నడుస్తున్న నేచురల్ థెరపీ సెంటర్లు ఎటువంటి మందులు లేకుండా శరీరం సహజ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా వ్యాధుల చికిత్సలో సహాయపడతాయి. ఈ కేంద్రాలలో మట్టి స్నానం, నీటి చికిత్స, సుగంధ చికిత్స, సూర్య చికిత్స, పంచకర్మ వంటి పద్ధతులు అవలంబిస్తారు.

  1. మట్టి చికిత్స: ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ మట్టి స్నానం వల్ల శరీరంలో ఉండే చెడును తొలగించేలా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  2. హైడ్రోథెరపీ: నీటి ద్వారా శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  3. అరోమా థెరపీ: సహజ సువాసనలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మనసుకు ప్రశాంతతను అందిస్తాయి.
  4. సూర్య చికిత్స: సూర్యరశ్మి విటమిన్ డి లోపాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. దీని ద్వారా ఎముకలు సైతం బలపడతాయి.
  5. పంచకర్మ చికిత్స: శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేయడానికి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు అందిస్తారు.

వ్యాధులకు సహజ పద్ధతిలో చికిత్స

ఇది బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ప్రారంభించిన ఆరోగ్య కేంద్రం. ఇక్కడ దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధులకు సహజ పద్ధతిలో చికిత్స చేస్తారు. ఇక్కడ ఆధునిక మందులకు బదులుగా, ఆయుర్వేద మందులు, యోగా, పంచకర్మ, ప్రత్యేక ఆహారంతో చికిత్స జరుగుతుంది. ఇది రోగులకు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉపశమనం ఇస్తుంది.

పతంజలి వైద్యం కార్యక్రమాలు ఏమిటి?

ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రాన్ని కలిపి పతంజలి ఒక ప్రత్యేకమైన వైద్యం కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. ఈ కార్యక్రమాలలో శరీరం లోపలి నుండి ఆరోగ్యంగా ఉండటానికి సహజ చికిత్స, యోగా, ధ్యానం, పంచకర్మ, సరైన ఆహారంపై దృష్టి కేంద్రీకరించవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతి పేషెంట్‌ సమస్యను దృష్టిలో ఉంచుకుని చికిత్సా ప్రణాళికను తయారు చేస్తారు.

పతంజలి చికిత్స ఎలా పనిచేస్తుంది?

పతంజలి వైద్యం కార్యక్రమం మందులకు బదులుగా ప్రకృతి వైద్యం, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ చికిత్స ఇలా జరుగుతుంది.

  1. ఆయుర్వేద చికిత్స: ఆయుర్వేద మందులతో శరీర అంతర్గత వ్యవస్థలు నయమవుతాయి.
  2. యోగా, ధ్యానం: యోగా, ధ్యానం శరీరాన్ని బలోపేతం చేస్తాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.
  3. పంచకర్మ చికిత్స: శరీరం నుంచి విషపదార్థాలు వంటివి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పంచకర్మ వంటి విధానాలు అవలంబిస్తారు.
  4. ప్రకృతి వైద్యం: మట్టి స్నానం, నీటి చికిత్స, సూర్య స్నానం వంటి సహజ పద్ధతుల ద్వారా శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది.
  5. సరైన ఆహారం: ఆరోగ్యకరమైన, సాత్విక్ ఆహారం శరీరానికి బలాన్ని ఇస్తుంది. వ్యాధుల నుండి రక్షిస్తుంది.

పతంజలి హీలింగ్ ప్రోగ్రామ్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ చికిత్స, వ్యాధిని దాని మూలాల నుండి నిర్మూలించడంపై ప్రాధాన్యత. ప్రతి రోగికి వేర్వేరు చికిత్సా ప్రణాళిక, యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

పతంజలి హీలింగ్ ప్రోగ్రామ్‌లో ఎలా చేరాలి?

మీరు కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, మందులు లేకుండా సహజ పద్ధతిలో నయం కావాలనుకుంటే మీరు పతంజలి వెల్నెస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ ఆయుర్వేద వైద్యులు, నిపుణుల పర్యవేక్షణలో మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యవంతులుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. పతంజలి వైద్యం కార్యక్రమం కేవలం చికిత్స మాత్రమే కాదు మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా బలంగా చేసే కొత్త జీవనశైలి.

ఏ వ్యాధులకు చికిత్స చేయవచ్చు?

పతంజలి హెల్త్‌కేర్ వెల్నెస్ అండ్ నేచురల్ థెరపీ సెంటర్‌లో అనేక వ్యాధులకు చికిత్స అందిస్తారు.

  1. మధుమేహం, ఊబకాయం: ఆయుర్వేద ఆహారం, యోగా ద్వారా రక్తంలో చక్కెర, బరువు నియంత్రించుకోవచ్చు.
  2. రక్తపోటు, గుండె సమస్యలు: సహజ చికిత్స రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
  3. డిప్రెషన్, ఒత్తిడి: యోగా, ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.
  4. నిద్రలేమి, నిద్ర సమస్యలు: ప్రకృతి వైద్యం శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది.
  5. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు: ఆయుర్వేద చికిత్సతో జీర్ణవ్యవస్థ బలపడుతుంది.

పతంజలి హెల్త్‌కేర్ ఇతరులకన్నా ఎందుకు భిన్నంగా ఉంటుంది?

  1. సహజ, దుష్ప్రభావాలు లేని చికిత్స: ఇక్కడ ఎటువంటి రసాయన మందులు లేకుండా వ్యాధులకు చికిత్స చేస్తారు.
  2. యోగా, ధ్యానం ప్రత్యేక సౌకర్యం: మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగాకు ప్రాధాన్యత ఇస్తారు.
  3. సరసమైన, ప్రభావవంతమైన చికిత్స: ఖరీదైన వైద్య చికిత్సలతో పోలిస్తే ఇది చాలా పొదుపుగా ఉంటుంది.
  4. అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణుల బృందం: ప్రతి రోగికి వారి సమస్య ప్రకారం సరైన చికిత్స లభిస్తుంది.

పతంజలి హెల్త్‌కేర్ సేవలను ఎలా పొందాలి?

మీరు కూడా మందులు లేకుండా సహజ పద్ధతిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు పతంజలి వెల్నెస్ సెంటర్, నేచురల్ థెరపీ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఈ కేంద్రాలలో మొదట మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తదనుగుణంగా చికిత్స అందిస్తారు. మీరు హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠాన్ని సందర్శించడం ద్వారా ప్రకృతి వైద్యం ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీనితో పాటు, పతంజలి హెల్త్‌కేర్ వివిధ కేంద్రాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ప్రజలు తమ సౌలభ్యం ప్రకారం చికిత్స పొందవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification