Patanjali: పతంజలి నుంచి మూత్రపిండ వ్యాధులకు దివ్యౌషధం.. పరిశోధనలో కీలక అంశాలు!

Written by RAJU

Published on:

Patanjali: పతంజలి నుంచి మూత్రపిండ వ్యాధులకు దివ్యౌషధం.. పరిశోధనలో కీలక అంశాలు!

పతంజలి సంస్థ నుంచి రకరకాల ఔషధాలు, వివిధ ప్రోడక్ట్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. హెల్త్‌కు సంబంధించి మందులను మార్కెట్లోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఔషధాన్ని తీసుకువచ్చింది. ఈ ఔషధం రెనోగ్రిట్ టాబ్లెట్. ఇది మూత్రపిండ వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. ఈ ఔషధం ప్రభావంపై పరిశోధన నేచర్ జర్నల్‌లో కూడా ప్రచురితమైంది. పతంజలి వారి ఈ ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మూత్రపిండాల వ్యాధిని నయం చేస్తుందని చెబుతారు. రెనోగ్రిట్ అల్లోపతి క్యాన్సర్ మందుల వల్ల కలిగే మూత్రపిండాల నష్టాన్ని నయం చేయడమే కాకుండా మూత్రపిండ కణాలపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం తీవ్రమైన మూత్రపిండ వ్యాధులలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇది శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగి ఉండదని చెబుతున్నారు.

ఈ ఔషధం శరీరంలోని మంటను నయం చేస్తుందని పరిశోధనలో తేలింది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సహజంగా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుందని పతంజలి చెబుతోంది. ఈ ఔషధం మూత్రపిండాల వ్యాధులను నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఔషధం పూర్తిగా ఆయుర్వేద మూలికలతో తయారు చేసినట్లు, ఇందులో పాష్నావేద్, పలాష్ ఉన్నాయయని తెలిపింది.

ఆయుర్వేద వైద్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు:

ఇక జాతీయ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రపంచంలో ఐదవ అత్యంత ప్రతిష్టాత్మక జర్నల్. పతంజలి ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మూత్రపిండాల వ్యాధిని నయం చేస్తుందని ఈ పరిశోధన నిరూపించింది. పతంజలి వారి ఈ ఔషధం మూత్రపిండాలపై ఇతర మందుల దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మూత్రపిండాలు దాని పనిని మెరుగ్గా చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఔషధం శరీరం నుండి ప్రమాదకరమైన విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రెనోగ్రిట్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఏ భాగానికీ ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరిశోధనలో తేలింది.

ఆయుర్వేదానికి కొత్త గుర్తింపు:

ఆయుర్వేద శాస్త్రీయ ఆధారాలను ప్రపంచ స్థాయిలో గుర్తించడంలో రెనోగ్రిట్ విజయం ఒక ముఖ్యమైన అడుగు అని పతంజలి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ అన్నారు. రెనోగ్రిట్ మూత్రపిండాల వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందనేది తన వాదన మాత్రమే కాదని ఆయన అన్నారు. నిజానికి ఈ ఔషధంపై పరిశోధన ప్రసిద్ధ అమెరికన్ పరిశోధన పత్రిక నేచర్ జర్నల్‌లో కూడా ప్రచురితమైంది. ఈ పరిశోధనకు సంబంధించిన లింక్‌ ఇక్కడ ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification