ABN
, Publish Date – Apr 02 , 2025 | 06:47 AM
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ, కేసు దర్యాప్తు లోతుగా జరుగుతుందన్నారు

మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు: అనిత
నక్కపల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో ఎవరైనా మత విద్వేషాలు రగిలించేలా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామ ని హోం మంత్రి అనిత హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆమెను మంగళవారం రాష్ట్ర పాస్టర్ల సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రవీణ్ పగడాల కేసు గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత కేసు దర్యాప్తు గురించి వివరించా రు. ఇప్పటికే లోతైన విచారణ జరుగుతోందని, ఒకటి, రెండు రోజుల్లో సమగ్ర నివేదిక వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారన్నారు. అయితే కావాలనే కొంతమంది ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
Updated Date – Apr 02 , 2025 | 06:47 AM