Particular trains: చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు

Written by RAJU

Published on:

హైదరాబాద్‌ సిటీ: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌- తిరుపతి (వయా వికారాబాద్‌, గుంతకల్‌) మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. మే 8 నుంచి 29 వరకు ప్రతి గురువారం సాయంత్రం 4.30గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి(07257), మే 9 నుంచి 30వ తేదీ వరకు ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లికి(07258) ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Shailaja Donempudi: శాస్త్రవేత్త శైలజకు అరుదైన గుర్తింపు

city1.2.jpg

ప్రత్యేకరైళ్లు మార్గమధ్యంలో సనత్‌నగర్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు(Sanathnagar, Lingampalli, Vikarabad, Tandur), సెడాం, యాద్గిర్‌, కృష్ణ, రాయచూర్‌, మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌(Mantralayam, Adoni, Guntakal), గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్‌, కోడూరు, రేణిగుంట(Rajampet, Kodur, Renigunta) స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించారు.

వార్తలు కూడా చదవండి

Cyber Fraud: నయా సైబర్‌ మోసం.. ఆర్మీ పేరుతో విరాళాలకు విజ్ఞప్తి

మెట్రో స్టేషన్లు, రైళ్లలో.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారంపై కట్టడి

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

మహిళపై చేయిచేసుకున్న పోలీస్

Read Latest Telangana News and National News

Updated Date – Apr 30 , 2025 | 07:15 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights