Parenting Tips : తల్లిదండ్రులు తమ పిల్లలతో ఈ పనులు చెప్పకపోతే.. వారు భవిష్యత్తులో..

Written by RAJU

Published on:

Parents Guide To Their ChildrenTips : ఇంటి పనులు పిల్లలు చేయాలా వద్దా అనే విషయంపై చాలా మంది తల్లిదండ్రుల మధ్య తరచుగా చర్చ జరుగుతుంది. కొంతమంది పిల్లలను ఇంటి పనులకు దూరంగా ఉంచి చదువులపై మాత్రమే దృష్టి పెట్టాలని కోరుకుంటారు. మరికొందరు పిల్లలను ఇంటి పనుల్లో కూడా భాగమయ్యేలా చేస్తేనే మంచిదని నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలను బాధ్యతాయుతంగా మార్చడానికి వారితో కొన్ని రకాల ఇంటి పనులు చేయించడం చాలా ముఖ్యం. పిల్లల వయసును బట్టి కొన్ని బాధ్యతలు, పనులను అప్పగించండి. తద్వారా కొన్ని సామాజిక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం కలుగుతుంది. కుటుంబంతో వారి బంధం కూడా బలపడుతుంది. పిల్లల మెరుగైన అభివృద్ధి కోసం వారి దినచర్యలో చదువు, క్రీడలు, కొన్ని చిన్న ఇంటి బాధ్యతలు ఉండే విధంగా తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు ఎలాంటి పనులు చేయమని చెప్పాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..

పిల్లలతో ఇంటి పనులు ఎందుకు చేయించాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు పిల్లలను చిన్న చిన్న ఇంటి పనుల్లో పాల్గొనేలా చేస్తే అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే తపన, చేయాలనే కోరికను కూడా వారిలో రేకెత్తుతుంది. మీరు వారికి ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు వారి మనసులో తాము చాలా ముఖ్యమైనవారనీ.. కుటుంబంలో వారికి ప్రాధాన్యత పెరిగిందనే భావన ఏర్పడుతుంది. ఇది పిల్లలలో బాధ్యతాయుత భావాన్ని సృష్టిస్తుంది. ఈ ఆలోచనలు వారికి జీవితాంతం ఉపయోగకరంగా ఉంటాయి. ఇది కాకుండా పిల్లలు చిన్నప్పటి నుండే సొంతంగా పనిచేసుకోవడాన్ని అలవర్చుకుంటారు. ప్రతి చిన్న పనికి వారి తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండటం అలవాటవుతుంది. ఈ పద్ధతి వారి నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపర్చి ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా తయారుచేస్తుంది.

పిల్లలను అలాంటి పని చేయమనండి.

పిల్లలకు వారి వయస్సును బట్టి ఎల్లప్పుడూ కొత్త పని లేదా బాధ్యతను అప్పగించండి. వారికి సురక్షితమైన, చాలా కష్టంగా లేదా గజిబిజిగా అనిపించని పనులు చేయమని వారిని ప్రోత్సహించండి. ఉదాహరణకు, మొక్కలకు నీరు పోయడం, మంచం దులిపి సర్దిపెట్టుకోవడం, బట్టలు మడతపెట్టడం, తినడానికి డైనింగ్ టేబుల్ అమర్చడం లేదా తిన్న తర్వాత టేబుల్ శుభ్రం చేయడం, ఊడ్చడం, పాత్రలు కడగడం, ర్యాక్‌లో బూట్లు అమర్చడం, వారి బొమ్మలను సరైన స్థలంలో ఉంచడం, ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువుకు ఆహారం ఇవ్వడం లాంటివి. పిల్లల కాస్త పెద్దయ్యాక కిరాణా షాప్‌కు సహాయంగా తీసుకెళ్లడం చేయవచ్చు.

తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి..

పిల్లలతో ఇంటి పనులు చేయించేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా వారితో ఎక్కువ పని చేయించకండి. వారి దినచర్యలో చదువు, క్రీడలు, ఇతర కార్యకలాపాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. అలాగే వారు ఏదైనా పని సక్రమంగా పూర్తి చేసినప్పుడు క్రెడిట్ వారికే ఇవ్వండి. మీ పనిని సులభతరం చేసినందుకు ప్రశంసించడం మర్చిపోకండి. మీకు ఎలా సహాయం చేశారో చెప్పండి. దీనితో పాటు వారితో సరదాగా కొంత సమయం గడపండి. పర్‌ఫెక్ట్‌గా పని చేయలేదని పిల్లలను కోపగించుకోకండి. బదులుగా వారితో పనిలో పాలుపంచుకుని ఆ పనిని ఎలా సమర్థవంతంగా చేయవచ్చో ప్రేమగా నేర్పండి.

Read Also : శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై కనిపించే 5 సంకేతాలు..

హోలీ రంగులతో చర్మానికి హాని కలగకూడదంటే.. ముందే ఇలా చేయండి..

Laughter: ఇలా రోజుకు 15 నిమిషాలు ఉన్నా చాలు.. బరువు తగ్గవచ్చు..

Subscribe for notification