Parenting: తల్లిదండ్రులు రోజూ ఈ పనులు చేస్తుంటే చాలు.. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది..!

Written by RAJU

Published on:

ఒత్తిడి, ఆందోళన ప్రజల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. వీటి ప్రభావం మెదడు మీద, జ్ఞాపకశక్తి మీద కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల చాలా విషయాలను మర్చిపోతుంటారు. పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా ఆందోళన, ఒత్తిడి అనుభవించడం ఈ మధ్య కాలంలో సాధారణం అయ్యింది. దీని కారణంగా పిల్లలు చదివిన విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పిల్లల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే తల్లిదండ్రులు రోజూ కొన్ని పనులు అలవాటు చెయ్యాలి. అవేంటో తెలుసుకుంటే..

తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!

ధ్యానం..

బిజీ లైఫ్ లో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 10 నిమిషాలు అయినా ధ్యానం చేయించాలి. ఇది పిల్లలలో ఏకాగ్రత పెంచుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

బ్రెయిన్ గేమ్..

జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి చెస్, సుడోకు, పజిల్ సాల్వింగ్ వంటి ఆటలు ప్రాక్టీస్ చేయించాలి. ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

వ్యాయామం..

శారీరక వ్యాయామం శరీరాన్నే కాకుండా మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రీడలు, స్కిప్పింగ్, యోగా, సైక్లింగ్ వంటివి బాగా సహాయపడతాయి.

మందంగా, ఒత్తుగా జుట్టును పెంచే సీక్రెట్ ఆయిల్.. దీన్నెలా చేయాలంటే..!

సమయ పాలన..

పిల్లలు క్రమశిక్షణతో క్రమశిక్షణతో ఉండాలంటే సమయపాలన చాలా అవసరం. ఒక పనిని ఒక నిర్ణీత సమయానికి చేయడం వల్ల పిల్లలు ఒత్తిడి లేకుండా ఉంటారు. చదువు మీద కూడా దృష్టి పెడతారు.

జ్ఞాపకశక్తి ఇలా పెంచుకోవచ్చు..

వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తుంటే మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే నిద్ర కూడా బాగుండాలి. మెదడుకు విశ్రాంతి లభించడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మెదడుకు పోషకాలు బగా అందితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి..

Health Tips: గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగితే కలిగే లాభాలు తెలుసా?

Peanuts: స్నాక్స్ గా వేరుశనగలు తింటే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!

Belly Fat: ఉదయాన్నే ఈ పానీయాలలో ఏ ఒక్కటి తాగుతున్నా చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights