Paneer: మార్కెట్ లోని పనీర్ తెచ్చుకుని తింటున్నారా.. కల్తీ పనీర్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా..

Written by RAJU

Published on:

Paneer: మార్కెట్ లోని పనీర్ తెచ్చుకుని తింటున్నారా.. కల్తీ పనీర్ అయితే ఎంత ప్రమాదమో తెలుసా..

ప్రస్తుతం కల్తీ కాలం నడుస్తోంది. మనం రోజూ తినే ఆహార పదార్థాలు కూడా కల్తీలకు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. ఇలా కల్తీ అవుతున్న ఆహారం లిస్టు లో పనీర్ పేరు అగ్రస్థానంలో ఉంది. మార్కెట్ నుంచి తెచ్చే పనీర్ నకిలీ (సింథటిక్) అయితే.. అది ఆరోగ్యానికి ప్రమాదకరం. నకిలీ పనీర్‌ తయారీకి సింథటిక్ పాలు, స్టార్చ్, డిటర్జెంట్ లేదా ఇతర రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. వేడి నీటి సహాయంతో మీరు మీ ఇంట్లో నకిలీ పనీర్‌ను గుర్తించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం?

వేడి నీటితో సింథటిక్ చీజ్‌ను ఎలా గుర్తించాలంటే

ఒక గిన్నెలో కొంచెం గోరువెచ్చని నీరు తీసుకోండి. అయితే నీటిని మరిగించవద్దు. గోరు వెచ్చగా ఉంచాలని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ గోరు వెచ్చని నీటిలో ఒక చిన్న పనీర్ ముక్క వేసి 5 నుండి 10 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత పనీర్‌లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో జాగ్రత్తగా గమనించండి. పనీర్ నిజమైనదైతే.. అది దాని ఆకృతిని నిలుపుకుంటుంది. నీటిలో కరిగిన తర్వాత కూడా గ్రీజు లేదా నురుగు ఏర్పడదు. దాని రంగు మారదు. వాసన సాధారణంగానే ఉంటుంది.

అదే నీటిలో వేసిన పనీర్ నకిలీదైతే.. అది త్వరగా కరిగిపోవడం.. నీటిలో చెల్లాచెదురుగా మారడం ప్రారంభమవుతుంది. నీటిపై తెల్లటి నురుగు లేదా నూనె లాంటి పొర కనిపిస్తుంది. దుర్వాసన వెలువడుతుంది. నీటిలో స్టార్చ్ లాంటి జిగట కనిపించే అవకాశం ఉంది.

కల్తీ పనీర్ ని ఎలా తనిఖీ చేయాలంటే

పనీర్‌ను మెత్తగా చేసి.. దానిలో 2-3 చుక్కల అయోడిన్ టింక్చర్ లేదా పసుపు నీరు వేయండి. అప్పుడు పనీర్ నీలం లేదా నలుపు రంగులోకి మారితే.. అది నకిలీ పనీర్ అని దానిలో స్టార్చ్ కలిపిన సంకేతం.

కల్తీ పనీర్ తినడం వల్ల ఏమి జరుగుతుంది?

  1. కడుపు నొప్పి, గ్యాస్ .. విరేచనాలు సమస్యలతో ఇబ్బంది పడవచ్చు.
  2. ఆహారం విషంగా మారే ప్రమాదం ఉంది.
  3. మూత్రపిండాలు, కాలేయంపై ప్రభావాన్ని చూపించవచ్చు.
  4. దీర్ఘకాలికంగా పనీర్ వాడకం వల్ల తీవ్రమైన అనారోగ్యం కలిగే అవకాశం ఉంది.
  5. ఎలాంటి పనీర్ ని ఎంచుకోవాలంటే
  6. విశ్వసనీయ బ్రాండ్ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించిన పనీర్ కొనండి.
  7. ఇంట్లో పనీర్ తయారు చేసుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం.
  8. చీజ్ కొనడానికి ముందు దాని వాసన చూసి, తాకడం ద్వారా దాని ఆకృతిని గుర్తించడం అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights