Pamban Bridge: ఇంజనీరింగ్ అద్భుతం.. పంబన్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. వీడియో చూశారా.?

Written by RAJU

Published on:

పంబన్‌ కొత్త వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.. శ్రీరామనవమి సందర్భంగా భారత ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన .. వారధి ప్రారంభం కాబోతోంది. 2.5 కిలోమీటర్ల పొడవున పంబన్‌ బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జ్‌ మధ్యలో షిప్‌లు వెళ్లేందుకు వీలుగా వర్టికల్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు ఇంజినీర్లు. తుప్పు పట్టకుండా బ్రిడ్జి మొత్తం స్పెషల్‌ కెమికల్‌తో కోటింగ్‌ చేశారు. ఆదివారం శ్రీ రామనవమి సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడును సందర్శించి.. రామేశ్వరం నుండి మెయిన్‌ల్యాండ్‌కు అనుసంధానించే నూతన పంబన్ రైలు వంతెనను ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తమిళనాడులో 8,300 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు. రామేశ్వరం-తాంబరం (చెన్నై)మధ్య నూతన రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

వీడియో చూడండి..

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన అయిన కొత్త పంబన్ రైలు వంతెనను ప్రారంభిస్తారు.. రోడ్డు వంతెన నుండి రైలు, ఓడను జెండా ఊపి వంతెనను ప్రారంబించి వంతెన పనితీరును వీక్షిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో దర్శనం చేసుకొని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు రామేశ్వరంలో తమిళనాడులో రూ.8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇంజనీరింగ్ అద్భుతం

నూతన పంబన్ బ్రిడ్జి.. భారత ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిపోనుంది.. అంతేకాకుండా ఈ వంతెన ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణం ప్రకారం, రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుండి ప్రారంభించినట్లు చెబుతారు.. దీనిని రూ. 550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. ఇది 2.08 కి.మీ పొడవు, 99 స్పాన్లు, 72.5 మీటర్ల నిలువు లిఫ్ట్ స్పాన్ కలిగి 17 మీటర్ల ఎత్తు వరకు పైకి కదలగలుగుతుంది. ఇది రైలు, ఓడల ప్రయాణాన్ని సజావుగా సాగడానికి ఉపయోగపడుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ రీన్‌ఫోర్స్‌మెంట్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్ మరియు పూర్తిగా వెల్డింగ్ చేయబడిన జాయింట్‌లతో నిర్మించిన ఈ వంతెన అత్యంత మన్నిక, తక్కువ నిర్వహణ అవసరాలను కలిగి ఉంది. భవిష్యత్ అవసరాలను తీర్చడానికి డ్యూయల్ రైలు ట్రాక్‌ల కోసం రూపొందించారు. ప్రత్యేక పాలీసిలోక్సేన్ పూత దానిని తుప్పుపట్టకుండా కాపాడుతూ కఠినమైన సముద్ర వాతావరణంలో చాలాకాలం మన్నికతో ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights