- హై అలర్ట్‌లో పాకిస్తాన్..
- ఎయిర్ పోర్టుల్లో భద్రతా పోట్రోకాల్ పెంపు..
- ఇస్లామాబాద్, రావల్పిండిలో F-16లు మోహరింపు..
- పీఓకే, గిల్గిత్‌కి అన్ని విమానాలు రద్దు..

Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం జరిగిన అత్యున్నత భేటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతీకారం కోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బుధవారం కూడా ప్రధాని వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, భారత్ సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, భారత్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో అని దాయాది దేశం పాకిస్తాన్ హడలి చేస్తోంది.
Read Also: Madras High Court: మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుంటే “వివాహం” రక్షించదు.. పోక్సో చట్టంపై హైకోర్ట్..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ హై అలర్ట్ అవుతోంది. భారత్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు విమానాలను క్యాన్సల్ చేసింది. గిల్గిట్, స్కర్డుతో పాటు పీఓకేలోని పలు ప్రాంతాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కరాచీ, లాహోర్ నుంచి స్కర్దు వెళ్లే రెండు విమానాలను, ఇస్లామాబాద్ నుంచి స్కర్దు వెళ్లే రెండు విమానాలను, ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్లే 4 విమానాలను రద్దు చేసింది.
భారత్‌తో పెరిగిన ఉద్రిక్తతలతో పాక్ తన గగనతలాన్ని హై అలర్ట్‌లో ఉంచింది. పాకిస్తాన్ అధికారులు అన్ని విమానాశ్రయాలను హై అలర్ట్‌లో ఉంచారు. భద్రత, నిఘా ప్రోటోకాల్‌ని గణనీయంగా పెంచారు. రావల్పిండి, ఇస్లామాబాద్‌లను రక్షించడానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ F-16 విమానాలను మోహరించింది. భారత్ దూకుడు వైఖరి కారణంగా పాకిస్తాన్ సియాల్‌కోట్ నుంచి ఆర్టిలరీ రెజిమెంట్‌ని ఇస్లామాబాద్‌కి తరలించింది. రావల్పిండిన రక్షించడానికి ఫైటర్ జెట్లను మోహరించినట్లు సమాచారం.