- పక్కా పథకం ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి..
- ముందుగా ఎగ్జిట్ గేట్ వద్ద కాల్పులు, ఎంట్రీ గేట్ వద్దకు టూరిస్టుల పరుగులు..
- ఎంట్రీ గేట్ వద్ద ఉన్న ఉగ్రవాదుల కాల్పులు..

Pahalgam terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే, టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో ప్రాణాలతో బయటపడిన వారు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో ఉగ్రవాదుల కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పించుకోవడానికి మార్గం లేకుండా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేట్ నుంచి రాగా, ఒకరు ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చారు. నాలుగో ఉగ్రవాది వీరికి సపోర్ట్ చేయడానికి అడవిలో దాగి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
Read Also: Rajya Sabha Election: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి.. సీఎంతో మర్యాదపూర్వక భేటీ..
ఉగ్రవాదులు ఇద్దరు సైనిక దస్తులు ధరించగా, మూడో వ్యక్తి సంప్రదాయ కాశ్మీరీ ఫెరాన్ ధరించి ఉన్నాడు. ముందుగా కాల్పులు ఎగ్జిట్ గేట్ వద్ద ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా పర్యాటకులు ఎంట్రీ గేట్ వైపు పరిగేత్తారు. అక్కడే కాపుకాసిన ఇద్దరు ఉగ్రవాదులు వీరిపై ఆకస్మికంగా దాడి చేశారు. ఎంట్రీ గేట్ వద్ద ఉగ్రవాదులు టూరిస్టుల్ని అదుపులోకి తీసుకుని మహిళల్ని, పరుషుల్ని వేరు చేశారు. ఆ తర్వాత హిందువులు, ముస్లింలుగా వేరు చేశారు. ఆ తర్వాత కాల్పులు జరిపే ముందు కల్మా చదవాలని ఉగ్రవాదులు కోరారు. ఎంట్రీ గేట్ వద్దకు వచ్చిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌ని టెర్రరిస్టులు మొదటగా కాల్చి చంపారు.
టీ స్టాల్, బేల్‌పురి స్టాల్స్ వద్ద ఎక్కువ మందిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. దాడి తర్వాత ఉగ్రవాదులు పార్క్ ఎడమ వైపు ఉన్న గోడను దూకి పారిపోయారు. ఈ దాడిపై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. బైసారన్ పార్క్‌లో దుకాణాలు కలిగి ఉన్న దాదాపు 45 మంది స్థానికులు, పోనీ రైడ్ ఆపరేటర్లను ప్రశ్నిస్తున్నారు. కాల్పులు జరుగుతుండగా ఒక పర్యాటకుడు ‘అల్లాహు అక్బర్’ అని మూడుసార్లు నినాదాలు చేస్తున్న వీడియోలో పట్టుబడిన జిప్‌లైన్ ఆపరేటర్‌ను కూడా విచారిస్తున్నారు.ఉగ్రవాదులు “మొబైల్ పెయిడ్ అప్లికేషన్” ను ఉపయోగించారని, వారు “పెయిడ్ ఎన్‌క్రిప్టెడ్ మొబైల్” ద్వారా తమ పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంభాషించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.