- పీఓకేలో 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్..
- సరిహద్దుల్లో 130 మంది టెర్రరిస్టులు..
- జమ్మూ కాశ్మీర్‌లో 56 మంది ఉగ్రవాదులు యాక్టివ్..
- కీలక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్ సంస్థలు..

Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగవారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 28 మంది మరణించారు. ఉగ్రవాదులు టూరిస్టుల్ని చుట్టుముట్టి కాల్చి చంపారు. ముఖ్యంగా, హిందువుల్ని టార్గెట్ చేశారు. పేర్లు, ఐడెంటిటీ కార్డుల్ని అడుగుతూ లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ సమయంలో భారత్‌కి అండగా నిలుస్తామని చెప్పాయి. ఈ దాడికి తామే పాల్పడినట్లు పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో సరిహద్దు వెంబడి 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నట్లు మన నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ లాండ్ ప్యాడ్స్‌లో శిక్షణ పొందిన టెర్రరిస్టులు, సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ స్థావరాల్లో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నారని అంచనా, వీరిలో 115 మంది పాకిస్తానీ జాతీయులని గుర్తించారు.
Read Also: Pahalgam Terror Attack: కరాచీ, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద హ్యాండర్లు.. పాక్ ప్రమేయంపై సంచలన ఆధారాలు..
మరోవైపు, భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో 56 మంది ఉగ్రవాదులు యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 18 మంది జైషే మహ్మద్, 35 మంది లష్కరే తోయిబా, ముగ్గురు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 17 మంది స్థానిక కాశ్మీర్ ఉగ్రవాదులు కాగా, మిగతా వారు పాకిస్తాన్‌కి చెందిన వారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికిలో 5-6 మంది ఉగ్రవాదులు ఉన్నారు. కామోఫ్లేజ్ గేర్ మరియు కుర్తా-పైజామాలు ధరించిన వీరు అడవుల నుంచి వచ్చి, ఏకే-47 ఉపయోగించి కాల్పులు జరిపారు. అత్యున్నత సైనిక శిక్షణ, అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను వాడారు. దీనిని బట్టి చూస్తే వీరికి పాక్ ఆర్మీ, ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు, వీరి ఫోటోలను విడుదల చేశారు.