
Pahalgam Terror Attack : భారత్ లో పర్యటిస్తున్న ఎంతో మంది పాకిస్తాన్ జాతీయులు పంజాబ్ లోని అటారీ-వాఘా సరిహద్దు గుండా తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులు ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్న తర్వాత సార్క్ వీసా పథకం ద్వారా భారత్ లో పర్యటిస్తున్ను పాక్ వాసులను 48 గంటల్లోకా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. దీంతో పలు కారణాల ద్రుష్ట్యా భారత్ లో పర్యటిస్తున్న పాక్ జాతీయుల్లో కొందరు గురువారం అటారీ వాఘా సరిహద్దు గుండా వెనక్కు వెళ్లిపోయారు. తమ బంధువులను కలుసుకునేందుకు 45రోజుల వీసా గడువుపై భారత్ కు వచ్చామని..ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కరాచీకి చెందిన కొంతమంది తెలిపారు కేంద్ర ఆదేశాల మేరకు బుధవారం అధికారులు అటారీ వాఘా సరిహద్దును మూసివేశారు.