విశాఖపట్నం, ఏప్రిల్ 30: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పాకిస్థానీలు వెంటనే భారత్ విడి వెళ్లాలంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు వారికి విధించిన గడువు సైతం ఏప్రిల్ 29వ తేదీతో ముగిసింది. అలాంటి వేళ.. విశాఖపట్నంలోని ఒక కుటుంబానికి తాత్కాలిక ఊరట లభించింది. సదరు కుటుంబం సోమవారం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీని కలిసింది. తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపింది.
ఈ కారణంతో అతడికి విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని వివరించింది. అతడికి చికిత్స మరికొంత కాలం అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమను విశాఖపట్నంలో ఉండేందుకు అనుమతించాలని నగర పోలీస్ కమిషనర్‌కు ఆ కుటుంబం అభ్యర్థించింది.
అయితే తాము దీర్ఘ కాల వీసా కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నామని సదరు పాకిస్థానీ ఫ్యామిలీ గుర్తు చేసింది. కానీ ఆ దరఖాస్తు పెండింగ్‌లో ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన నగర సీపీ శంఖబ్రత బాగ్చీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు.
ఆ క్రమంలో ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపింది. దీంతో ఈ పాకిస్థానీ ఫ్యామిలీ భారత్‌లో ఉండేందుకు మౌఖిక అనుమతి ఇచ్చిందని నగర సీపీ శఖబ్రత బాగ్చీ తెలిపారు. మరో నోటీసు వచ్చే వరకు వారు విశాఖలో ఉండేందుకు అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు.
ఈ ఫ్యామిలీలోని భర్త,పెద్ద కుమారుడికి పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. కాగా భార్య, చిన్న కుమారుడికి మాత్రం భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్‌ను ఆ ఫ్యామిలీ కలిసి.. తమ కుటుంబ పరిస్థితిని వివరించడంతో నగర సీపీ ఈ చర్యలు తీసుకున్నారు.
ఇవి చదవండి..
Pahalgam Terror Attack: ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్
Fire Accident: అగ్నిప్రమాదం 14 మంది సజీవ దహనం
For National News And Telugu News
Updated Date – Apr 30 , 2025 | 09:04 AM