పహల్గాంలోని మామలేశ్వర్ ఆలయం కాశ్మీర్ లోయలోని పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కొంతమంది చరిత్రకారులు దీనిని 12వ శతాబ్దంలో రాజా జయసింహ కాలంలో నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. హిందువులకు భక్తి కేంద్రంగా ఉన్న ఈ ఆలయంలో శివలింగం పూజలను అందుకుంటుంది. ఈ గుడిలో ఒక పీఠంతో పాటుగా శివ లింగం ఒక నీటి నీటి బుగ్గలో కవర్ చేయబడి ఉంటుంది. ఈ శివలింగానికి దైవిక శక్తి ఉందని.. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళే చాలా మంది భక్తులు అమరనాథ్ ని దర్శనం చేసుకునే ముందు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు.
ఆలయానికి సంబంధించిన పౌరాణిక కథలు…
ఈ ఆలయంతో ముడిపడి అనేక పౌరాణిక కథలు ముడిపడి ఉన్నాయి. ఒక పౌరాణిక గాథ ప్రకారం, పార్వతి దేవి స్నానానికి వెళ్తూ ఈ ప్రదేశంలో గణేశుడిని ద్వారపాలకుడిగా నియమించింది. లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చూడమని చెప్పింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడిని లోపలకు వెళ్లకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడే శివుడు… వినాయకుడి తలను ఖండిస్తాడు. అనంతరం బాలుడికి ఏనుగు తలను అతికించిన ప్రదేశం ఇదే అని నమ్మకం. ఈ కారణంగా కూడా ఈ ప్రదేశం శివ, గణపతుల భక్తులకు ముఖ్యమైనది. ఆలయం చుట్టూ ఉన్న సహజ సౌందర్యం భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఆలయంలో రెండు ముఖాల నంది విగ్రహం ఉంటుంది. ఇది ఇతర శివాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా ఉంది. మామలేశ్వర్ ఆలయాన్ని సందర్శించకుండా పహల్గామ్ పర్యటన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం కేవలంహిందువులకు పవిత్ర స్థలం మాత్రమే కాదు, భక్తులు శివుని ఉనికిని అనుభూతి చెంది ఆధ్యాత్మిక శాంతిని పొందే ప్రదేశం. ఈ కారణాలన్నింటి వల్ల, మామలేశ్వర్ ఆలయం శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ప్రత్యేకమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది.
ఇవి కూడా చదవండి
శివ పార్వతిల ఐక్యతకు చిహ్నం
పార్వతి దేవి ఇక్కడే శివుని కోసం తపస్సు చేసి ఆయనను భర్తగా పొందిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయం శివ-పార్వతిల కలయికను సూచిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని వివాహం, ప్రేమ, భక్తి కలగలిపిన ప్రదేశంగా భావిస్తారు.
పురాణ ప్రాముఖ్యత
ఈ ఆలయం గురించి కల్హణుడు రాసిన రాజతరంగిణిలో కూడా ప్రస్తావించబడింది. ఇది 8వ శతాబ్దం లేదా అంతకంటే పాతది. ఇది పురాణాలకు, మునులకు, ఋషులకు, సాధకులు ధ్యానం చేసే వారికీ దైవిక, శక్తివంతమైన ప్రదేశంగా చేస్తాయి.
అమర్‌నాథ్ యాత్ర ప్రధాన స్టేషన్
అమర్‌నాథ్ యాత్ర పహల్గామ్ నుంచి ప్రారంభమవుతుంది. మామలేశ్వర్ ఆలయం అదే మార్గంలో ఉంది. శివ భక్తులు అమర్‌నాథ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వెళ్లి శివయ్యని దర్శనం చేసుకుని తమ ప్రయాణాన్ని మొదలు పెట్టడం శుభప్రదం అని భావిస్తారు.
అందం, శాంతి సంగమం
ఈ ఆలయం లిడ్డర్ నది ఒడ్డున పహల్గామ్ లోని ప్రశాంతమైన, సుందరమైన లోయలలో ఉంది. సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తి కలిసే ఈ ప్రదేశం ధ్యానం, సాధన , స్వీయ శుద్ధికి అనువైనది.
ఆలయ ప్రత్యేక నిర్మాణం
ఈ ఆలయం కాశ్మీర్ శైలిలో పురాతన రాతి నిర్మాణంలో నిర్మించబడింది. ఇందులో అందమైన రాతి శిల్పాలతో కూడిన జల్ కుండ్ (పవిత్ర జలం) ముఖ్యంగా పవిత్రమైనదిగా భావించే శివలింగం కూడా ఉన్నాయి.
ప్రత్యేక పండుగలలో వేడుకలు
మహా శివరాత్రి, శ్రావణ మాసాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తారు. రాత్రి జాగరణ, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పండుగల సమయంలో వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. ఇది ఈ అలయ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.
అద్భుతమైన విశ్వాసం
స్థానిక ప్రజలు, భక్తులు ఇక్కడ నిర్మలమైన హృదయంతో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలోని నీటి సరస్సుని అద్భుతంగా భావిస్తారు. దీనిలో స్నానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఉపశమనం లభిస్తాయని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు