Pahalgam: ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమీషన్‌లోకి కేక్‌! సెలబ్రేషన్స్‌ కోసమేనా?

Written by RAJU

Published on:

పాకిస్తాన్ హైకమిషన్‌కు ఒక వ్యక్తి కేక్ డెలివరీ చేస్తున్న దృశ్యాలను చూపించే క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. పహల్గామ్‌లో ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఇలా ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లోకి కేక్‌ తీసుకెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది. వైరల్ వీడియోలో విలేకరులు కేక్ మోసే వ్యక్తిని చుట్టుముట్టి కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ప్రశ్నించారు. కానీ, ఆ కేక్‌ తీసుకెళ్లిన వ్యక్తి మాత్రం స్పందించలేదు. దీంతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సమీపంలో 500 మందికి పైగా ప్రజలు నిరసన తెలిపారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ, పొరుగు దేశంపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని, ఇది దేశంపై జరిగిన దాడి అని, దీని ప్రతీకారం బలంగా తీర్చుకుంటాం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతకంటే ముందే.. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సాయంత్రం భద్రతా కేబినెట్ కమిటీ సమావేశమై ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనలను ధృవీకరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights