Over Thinking: నేటి బిజీ లైఫ్‌లో నిద్ర లేచిందే మొదలు ఉద్యోగాలు అంటూ పరుగులు పెడతారు. అయితే, కొంతమంది మాత్రం ఎన్ని పనులు ఉన్నప్పట్టికీ అతిగా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అతిగా ఆలోచించడం అనేది సాధారణ సమస్య అయినప్పటికీ దాని నుండి బయటపడకపోతే మాత్రం అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అంతేకాకుండా టెన్షన్, ఒత్తిడి, నిద్ర తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి. కాబట్టి, ఈ చర్యలను అనుసరించి ఆ సమస్య నుండి ఉపశమనం పొందండి..
1. యోగ, ధ్యానం
ధ్యానం, యోగా మనస్సును శాంతపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి చాలా ప్రభావవంతమైన మార్గాలు. ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి ధ్యానం, యోగా చేయండి.
2. శారీరక కార్యకలాపాలు
వ్యాయామం, పరుగు, ఈత వంటి శారీరక కార్యకలాపాలు ఎండార్ఫిన్ హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గిస్తాయి.
3. మీ భావోద్వేగాలను వ్యక్తపరచండి:
మీ భావాలను మీకు నచ్చిన వ్యక్తితో షేర్ చేసుకోండి. ఇది మీకు తేలికైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది.
4. ప్రతికూల ఆలోచనలను వదిలేయండి:
మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని విడిచి పెట్టండి.. సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టండి.
5 ప్రస్తుత క్షణంలో జీవించండి:
గతం, భవిష్యత్తు గురించి చింతించడం మానేసి, వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించండి.
6. నిద్ర:
నిద్ర లేమి కూడా అతిగా ఆలోచించే సమస్యను పెంచుతుంది. కాబట్టి రోజూ 7-8 గంటలు నిద్రపోండి.
7. నిపుణులను సంప్రదించండి:
మీరు ఈ సమస్యను మీ స్వంతంగా ఎదుర్కోలేకపోతున్నారని మీరు భావిస్తే, మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం కోరేందుకు సిగ్గుపడకండి. నిపుణులను సంప్రదించి మీ సమస్యను దూరం చేసుకోండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)