ఇంటర్నె్ట్ డెస్క్: నారింజకు ఉండే ప్రత్యేకమైన సువాసన, రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నారింజతో కలిగే ప్రయోజనాల గురించి కూడా దాదాపు అందరికీ తెలిసిందే. అయితే, నారింజ తినే వాళ్లంల్లో మూడ్ మెరుగవడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరిగే అవకాశం ఉందని హార్వర్డ్ మెడికల్ స్కూ్ల్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
నిమ్మజాతికి చెందిన నారింజ పండుతో డిప్రెషన్ ముప్పు తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రయోజనం ఆరటి, యాపిల్స్ లేని విషయం కూడా చెప్పారు. నారింజలోని విటమిన్ సీ న్యూరాన్లు సరిగ్గా ఎదిగేలా చేస్తుందట. వాటి చుట్టూ ఓ రక్షణ పొర ఏర్పడి సమాచార మార్పిడి వేగంగా జరుగుతుందట. అంతేకాకుండా, మెదడులో కీలకమైన రసాయనాలు ఉత్పత్తిని కూడా నారింజ మెరుగుపరుస్తుంది.
Health Benefits of Fruits: రోజూ ఓ చిన్న గిన్నెడు పండ్లు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా
ఇక నారింజలోని ఫ్లేవనాయిడ్స్ అనే పేగుల్లో హితకర బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఫలితంగా మానసికోల్లాసం పెంచే సెరెటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్ల విడుదల పెరుగుతుంది. అంతేకాకుండా, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం వంటి మెళకువలకు కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగాన్ని కూడా నారింజలోని పోషకాలు క్రీయాశీలకం చేస్తాయట. దీంతో, నారింజతో జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Signs of Heart Disease In Legs: కాళ్లల్లో ఈ మార్పులు గుండె జబ్బులకు సంకేతం
అయితే, నిమ్మజాతి పండ్లతో మెదడు ప్రక్రియలు మెరుగవుతాయని చెప్పేందుకు మరింత పరిశోధనలు జరిగాల్సి ఉందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డిప్రెషన్ చికిత్సలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని, ఈ దిశగా నారింజ ప్రయోజనకరంగా మారొచ్చని చెప్పారు. అయితే, పేగుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ముడిపడి ఉందన్న విషయం కూడా తమ పరిశోధనల్లో చాలా వరకూ స్పష్టమైందని పేర్కొన్నారు.
Green Grapes Vs Black Grapes: ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏటంటే..
Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!
Read Latest and Health News