- ఇకపై కన్ఫామ్ టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి ప్రయాణికులు..
- రద్దీని తగ్గించేందుకు రైల్వే కీలక నిర్ణయం..

Indian Railways: రైల్వే స్టేషన్‌లలో రద్దీని నియంత్రించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించనున్నారు. దేశంలో అతిపెద్దవైన 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ముఖ్యమైన స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..
భారత రైల్వే పండగలు, సెలవుల సమయంలో రద్దీని ఎదుర్కొంటున్నాయి. చాలా మంది తమ బంధువుల్ని దింపడానికి, లేదా వారిని తీసుకెళ్లేందుకు రైల్వే స్టేషన్లకు వస్తుంటారు. ఇది రద్దీకి దారి తీస్తోంది. కొత్త నిబంధనల వల్ల ఇలాంటి వారిని స్టేషన్‌లోకి అనుమతించరు. దేశంలోని 60 అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనల్ని అమలు చేస్తారు. ఈ జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టెర్మినస్-ముంబై, హౌరా జంక్షన్, చెన్నై సెంట్రల్, బెంగళూర్ సిటీ రైల్వే స్టేషన్ ఉన్నాయి. జన రద్దీ నియంత్రణ అవసరాలను బట్టి అదనపు స్టేషన్ల జాబితాను చేర్చనున్నారు.
ప్రయాణికులు ముందస్తు బుకింగ్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని, వారు రైల్వే స్టేషన్‌కి వచ్చిన సమయంలో టికెట్ కన్ఫామ్ అయినట్లు నిర్ధారించుకోవాలి. ఈ కొత్త విధానం ప్లాట్‌ఫామ్‌లపై రద్దీని తగ్గించాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసకున్నారు. ఎంపిక చేసిన స్టేషన్ పరిసరాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పెద్ద రైల్వే స్టేషన్లలో వార్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. రద్దీగా ఉన్న సమయంలో అధికారుల మధ్య సమన్వయానికి ఇది ఉపయోగపడుతుంది. సర్వీస్ స్టాఫ్‌ని సులభంగా గుర్తించేందుకు కొత్త యూనిఫాంను జారీ చేయనున్నారు.