Online Shopping: మీరు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? ఇవి గుర్తించుకోండి.. లేకుంటే నష్టపోతారు! – Telugu News | How to avoid being scammed when shopping online?

Written by RAJU

Published on:

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇతర ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు వినియోగదారుల కోసం రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంటాయి. ఇప్పుడు పండగ సీజన్‌ ఉంది. రాబోయే ఉగాది సందర్భంగా ఎన్నో ఆఫర్లను అందిస్తుంటాయి. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మోసపోయే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని టిప్స్ పాటిస్తే ఎంతో మంచిది. మీరు ఏవైనా వస్తువులు కొనాలనుకుంటే సేల్ కన్నా ముందే వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సేల్ కన్నా ముందు వాటి ధరలు ఎంత ఉన్నాయో, సేల్ సమయంలో ఎంత ఉన్నాయో ట్రాక్ చేయడం మంచిది. కొన్ని వస్తువుల ధరలు సేల్ సమయంలో కూడా తగ్గవు. అలాంటప్పుడు మీరు సేల్ వరకు ఎదురు చూడటం వృథానే.

ఇది కూడా చదవండి: Financial Planning: స్కీమ్‌ అంటే ఇది కదా మావ.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.3.60 కోట్లు పొందే ఛాన్స్‌!

డిస్కౌంట్‌ యాడ్స్‌ను చూసి నమ్మొద్దు:

మీరు నేరుగాసేల్ సమయంలోనే మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తే అప్పుడు ధర తగ్గిందా లేదా అన్న విషయం తెలియదు. అందుకే ముందు నుంచే ట్రాక్ చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇ-కామర్స్ సైట్‌లో కనిపించే డిస్కౌంట్లను పూర్తిగా నమ్మకూడదు. 50 శాతం, 60 శాతం, ఒక్కోసారి 90 శాతం డిస్కౌంట్ అని యాడ్స్ కనిపిస్తాయి. స్క్రీన్‌లపై కనిపిస్తున్న డిస్కౌంట్స్ చూసి మోసపోకూడదు.

బ్యాంక్ ఆఫర్స్ చెకింగ్‌:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువుల ధరలను ట్రాక్ చేసేందుకు వెబ్‌సైట్స్, యాప్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. మీరు కొనాలనుకునే వస్తువులను విష్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. ఆ ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఆఫర్స్ ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కొనే వస్తువులకు బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి.

డిస్కౌంట్లు:

అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్టు సేల్స్‌ సమయంలో క్రెడిట్‌ కార్డులపైలపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తాయి. బ్రాండ్స్ వేర్వేరు అయినా ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ ఓ వ్యసనం లాంటిదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడితే చాలు ప్రతి సారి ఏదో ఒకటి కొనేందుకు ప్లాన్‌ చేస్తుంటారు. ఈ వ్యసనంలో పడి అవసరం లేని వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు. అవసరం లేని వస్తువులు కొంటూ పోతే జేబు ఖాళీ అవుతుంటుంది.

ఇది కూడా చదవండి: PAN card: మీకు కొత్త పాన్‌ కార్డ్‌ కావాలా..? కేవలం 10 నిమిషాల్లోనే.. ఎలాగంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification