డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. వేడి వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండటానికి కూడా పచ్చి ఉల్లిపాయల్ని తినమని చాలా మంది సలహాలు కూడా ఇస్తుంటారు.
పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఇది బాడీ హీట్ ను కూడా తగ్గిస్తుంది. ఎండాకాలం ఉల్లిపాయలు తింటే డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
ఉల్లిపాయలో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిపాయలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని కూడా పెంచుతాయి.
ఉల్లిపాయలను తరచూ తీసుకోవడం వల్ల హానికరమైన UV కిరణాలు వేసవి సూర్యునితో సంబంధం ఉన్న పర్యావరణ టాక్సిన్స్ నుండి రక్షణను అందిస్తుంది. ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్ ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఉల్లిపాయల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఉల్లిపాయ తింటే మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందుతుంది. అంతేకాదు.. ఉల్లిపాయలో ఉండే పొటాషియం ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్, ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.