11 రాష్ట్రాల్లో..
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ వంటి 11 రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీలను వరుసగా ఆయా రాష్ట్రాల్లోని ఒకే సంస్థలో విలీనం చేయనున్నారు. ఏప్రిల్ 5, 2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం విలీనం అమలు తేదీని మే 1గా నిర్ణయించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం, 1976లోని సెక్షన్ 23ఎ (1) కింద ఇచ్చిన అధికారాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.