off the report over mlc kavitha

Written by RAJU

Published on:

off the report over mlc kavitha

రాజకీయ నేతలు…ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. కాలు జారినా ఫర్వాలేదు…కానీ నోరు జారొద్దనేది నానుడి. అయితే బీఆర్ఎస్ సీనియర్‌ పొలిటిషియన్‌…మాత్రం ఓ డిప్యూటీ సీఎంపై టంగ్‌ స్లిప్పయ్యారు. అంతటితో ఆగని ఆమె…బై లక్ పదవి వచ్చిందంటూ కామెంట్ చేశారు. దీనిపై ఆ డిప్యూటీ సీఎం అభిమానులు, కార్యకర్తలు…అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు ? ఇంతకీ ఎవరా బీఆర్ఎస్ లీడర్‌ ? రాజకీయాల్లో నేతలు ఎవరైనా సరే…ఎంతటి స్థాయిలో ఉన్నా సరే…ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేసే అడుగులైనా…జనం ముందు మాట్లాడే మాటలైనా…ఎందుకంటే చిన్న తప్పు దొరికినా…ప్రత్యర్థులు కాచుకొని ఉంటారు. ఏ చిన్న వివాదం దొరికినా…దాన్ని రచ్చ చేయడానికి సిద్ధంగా ఉంటారు. సాధారణ చేసినా వ్యాఖ్యలైనా సరే…ఒక్కోసారి వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…చేసిన కామెంట్స్‌ తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఓ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో…పవన్‌ సీరియస్‌ పొలిటిషియన్‌ కాదని…అదృష్టం కొద్దీ డిప్యూటీ సీఎం అయ్యారంటూ వ్యాఖ్యానించారు. చేగువేరా భావాలున్న పవన్ కళ్యాణ్…ఇప్పుడు రైటిస్ట్ ఎలా అయ్యారని ప్రశ్నించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు, జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉన్న తమ నేతను తక్కువ చేసి మాట్లాడుతారా ? ఆయన స్థాయిని కించపరుస్తారా ? అంటూ కవితపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా సోషల్ మీడియా వేదికగానే కవితపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కవిత జైలుకు ఎందుకు వెళ్లి వచ్చిందో అందరికీ తెలుసని…లిక్కర్ స్కాంకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. గతంలో అరెస్ట్ అయినప్పటి వీడియోలను బయటికి తీసి వైరల్‌ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా…లిక్కర్ స్కామ్ చేసి జైలుకు వెళ్లి వస్తేనే సీరియస్ పొలిటిషన్ అవుతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక కేసీఆర్ కూతురుగా మాత్రమే కవిత రాజకీయాల్లోకి వచ్చారని…తండ్రి లేకుంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చేదా ? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ అండ చూసుకొని రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవితపై నెటిజన్ల కామెంట్లు…బీఆర్ఎస్‌లోనూ అంతర్గత చర్చ జరుగుతోంది.

కవిత వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారో లేదో కానీ…ఆయన అభిమానులు ఘాటుగానే కవితకు కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జన సైనికులు…కవిత అభిమానుల నుంచి వచ్చే కామెంట్లకు కూడా తిప్పికొడుతున్నారు. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కేసీఆర్ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్దం జరిగింది. ఇప్పుడు కవిత మాటలతో మరొసారి బిఆర్ఎస్, జనసేన కార్యకర్తలు…సోషల్ మీడియా వేదికగా వార్‌ సాగుతోంది. ఈ వ్యాఖ్యలకు కవిత సారీ చెబుతారా ? లేదంటే వివాదాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights