off the document over rajasingh

Written by RAJU

Published on:

off the document over rajasingh

ఆ సీనియర్‌ లీడర్‌ భయపెట్టి బర్త్‌ డే విషెస్‌ చెప్పించుకున్నారా? ఎమోషన్స్‌ని టచ్‌ చేసి… ఎందుకొచ్చిన గొడవ అనుకునే చేసి…శుభాకాంక్షలు చెప్పించుకున్నారా? పక్క పార్టీ వాళ్ళతో పోలిక పెట్టిమరీ… తన పార్టీ లీడర్స్‌ ఎక్స్‌లో హోరెత్తించేలా చేసుకున్నారా? ఎవరా లీడర్‌? ఏంటా బర్త్‌ డే మేటర్‌? మంగళవారంనాడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పుట్టినరోజు. సహజంగానే పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్ట్‌గా కలిసినవాళ్ళు కొందరైతే…. సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెప్పిన వాళ్ళు మరికొందరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గోషామహల్‌ ఎమ్మెల్యేకి శుభ సందేశం పంపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పుట్టినరోజున ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శుభాకాంక్షలు పంపించడం ఆనవాయితీ కూడా. రిప్లయ్‌లో రాజాసింగ్‌ ముఖ్యమంత్రికి ధ్యవాదాలు తెలిపారు. అక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది. ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాయి. కానీ… అంత చేసినా… రాజాసింగ్‌కు మాత్రం సంతృప్తి కలగలేదట. మదిలో ఏదో అలజడి, తెలియని అసంతృప్తి…. ఎందుకిలా? వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారన్న అసహనం? శుభాకాంక్షలు చెబుతున్న వాళ్ళకు కూడా సరిగా రెస్పాండ్‌ అవలేనంగా పెరిగిపోయిందట ఫ్రస్ట్రేషన్‌. ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే ఓ మెసేజ్‌ కొట్టారాయన. అది కూడా తన సొంత పార్టీ నాయకులని ఉద్దేశించి. మా పార్టీ సీనియర్ నాయకులకు మా పుట్టిన రోజులు గుర్తుండవుగానీ… తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలు చెప్పారంటూ సెటైరికల్‌గా మెసేజ్‌ పెట్టి మీడియాకు పంపడంతో… ఉలిక్కి పడ్డారట తెలంగాణ బీజేపీ పెద్దలు. అసలే పార్టీ మీద ఫైర్‌తో ఉన్నారు రాజాసింగ్‌.

 

దానికితోడు బర్త్‌డే విషెస్‌ కూడా చెప్పలేదంటూ మెసేజ్‌ పెట్టేసరికి ఎందుకొచ్చిన గొడవ, ఇది ఎట్నుంచి ఎటు పోతుందోనని అనుకుంటూ… సీనియర్స్‌ అంతా వరుసబెట్టి సందేశాలు పంపేశారట. మెసేజ్‌ శుభాకాంక్షలతోనే ముంచెత్తారట. ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆన దగ్గరికి వెళ్ళి గ్యాప్‌ తగ్గించే ప్రయత్నం చేశారు. రాజా సింగ్ కూడా కాస్త మెత్తబడ్డట్టు కనిపించారు. కానీ… బర్త్‌డే విషయంలో చేసిన కామెంట్ మాత్రం ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కి పడేట్టు చేసిందట. ఇక ఎందుకొచ్చిన పంచాయితీ అనుకున్నారో, లేక ఎమ్మెల్యే ఫైర్‌ని చల్లబరుద్దామని అనుకున్నారోగానీ…. వరుసగా శుభాకాంక్షలతో హోరెత్తించారట. రాజాసింగ్‌ మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో మీడియాకు నిరసన మేసేజ్ చేస్తే… ఆ వెంటనే…. ఎక్స్‌లో యాక్టివ్‌ అయిపోయి బర్త్‌ డే విషెస్‌తో హోరెత్తించారట కాషాయ పార్టీ సీనియర్స్‌. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, అరవింద్, మురళీధర్ రావు లాంటి నేతలంతా అప్పుడు వరుసకట్టారట. బండి సంజయ్ ఉదయమే చెప్పగా , రాజా సింగ్ మీడియాకు మేసేజ్ పెట్టిన సమయంలోనే ఈటల X వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దీంతో తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కొత్త రకమైన చర్చ జరుగుతోంది. పుట్టిన రోజు శుభాకాంక్షల్ని ఇలా కూడా చెప్పించుకుంటారా? భయపెట్టి మరీ బర్త్‌ డే విషెస్‌ చెప్పించుకోవడంలో నీకు నువ్వే సాటి…. ఏమైనా రాజా నువ్వు గ్రేట్‌ అంటూ సెటైర్స్‌ వేస్తున్నారట కొందరు పార్టీ నాయకులు. కారణం ఏదైనా, సందర్భం ఏదైనాగానీ… రాజాసింగ్‌ రియాక్షన్స్‌ మాత్రం తెలంగాణ బీజేపీని షేక్‌ చేస్తున్నాయని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights