బీసీలకు ఇంకా చేస్తాం..
‘నాయి బ్రాహ్మిణ్ ఫెడరేషన్, ఎంబీసీ ఫెడరేషన్, బీసీలకు కార్పోరేషన్లు, బీసీ భవన్‌లు, బీసీలకు ప్రత్యేక ప్రణాళిక, బీసీ విద్యార్ధులకు రెసిడెన్షియల్ స్కూళ్లు, మత్య్యకార పిల్లల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, విదేశాల్లో చదువుకునేలా రూ.15 లక్షలు ఒక్కో విద్యార్ధికి ఆర్ధిక సాయం, పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు కోచింగ్, అలాగే బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది టీడీపీ. డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ప్రతి జిల్లా నుంచి 220 మందికి కోచింగ్ అందిస్తాం. ఆదరణ-3ని తీసుకువస్తాం’ అని సీఎం వెల్లడించారు.