- ఈ కేసులోని ఆరు నిందితుడికి నోటీసులు
- విచారణ హాజరుకావాలని పేర్కొన్న దర్యాప్తు బృందం
- ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ములుపు చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం ఈ కేసులోని ఆరు నిందితుడికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. పోలీసులు ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలని తెలిపారు.
READ MORE: Regina : ఆయనను చూస్తేనే భయమేసేది…
పోలీస్ విచారణకు సహకరించాలని శ్రావణ్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. శ్రావణ్ రావును అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఈకేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు లపై పోలీసులు రెడ్ కార్న్ నోటీసులు జారీ చేశారు. శ్రావణ్ రావును విచారిస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
READ MORE: Irfan Pathan: “నేను దీన్ని సమర్థించను”.. ధోని బ్యాటింగ్ ఆర్డర్‌పై ఇర్ఫాన్ పఠాన్ రియాక్షన్..