- అద్భుత ఆవిష్కరణకు సిద్దమైన CMF..
- ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు ఫోన్, ఆడియో గాడ్జెట్ల లాంచ్.

CMF Phone 2: 2020లో ప్రారంభమైన నథింగ్ (Nothing) లండన్ ఆధారిత టెక్ కంపెనీ. టెక్నాలజీకి డిజైన్ పరంగా ఈ కంపెనీ కొత్త మార్పులు తీసుకురావడంలో బాగా ప్రసిద్ధి చెందింది. 2023లో ఈ Nothing తన సబ్‌బ్రాండ్ అయిన CMF ద్వారా మొదటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు, ఈ సబ్‌బ్రాండ్‌లో రెండో స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 2 Pro ను ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
ఇకపోతే ఈ CMF Phone 2 Pro టీజర్ పరంగా చూసినట్లయితే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో సెన్సార్లతో కూడిన ప్రధాన కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరాల కోసం ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త టీజర్‌లో ఫోన్‌కు టెక్స్చర్డ్, టాక్టైల్ ఫినిష్ ఉందని స్పష్టంగా చూపించారు. మెటాలిక్ భాగంలో స్క్రూ డిజైన్‌తో క్లోజ్ అప్ ఇమేజ్ ఒక స్టైలిష్, కస్టమైజబుల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది గత CMF Phone 1లో చూసినదానితో పోలిస్తే కాస్త మార్పులు కనపడుతున్నాయి.
ఇక సమాచారం మేరకు ఇందులో ఫీచర్లు, సిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే 6.3 అంగుళాల స్క్రీన్ ఉండొచ్చు. ఇది Phone (1) లోని 6.67 అంగుళాల స్క్రీన్ కన్నా చిన్నది. కస్టమైజబుల్ బ్యాక్ కవర్, ఇతర యాక్సెసరీల కోసం స్క్రూ ఫీచర్లు కొనసాగించనున్నారు. డిజైన్ పరంగా ఈ ఫోన్ నూతన అభిరుచి కలిగిన వినియోగదారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇకపోతే ఈ CMF Phone 2 Pro లాంచ్ సందర్భంగా Nothing కంపెనీ మూడు కొత్త ఆడియో ఉత్పత్తులను కూడా విడుదల చేయనుంది.
గత ఏడాది మోడల్‌కు అప్డేటెడ్ వెర్షన్ గా CMF Buds 2, CMF Buds 2a, Buds 2 Plus కొత్త మోడల్స్ విడుదల కానున్నాయి. ఇవి CMF Buds Pro 2 కన్నా తక్కువ ధరలో లభించవచ్చు. ఈ ఫోన్‌ను, ఆడియో గాడ్జెట్లను కంపెనీ ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు లాంచ్ చేయనుంది. మొత్తంగా కొత్తగా రాబోయే ఈ CMF Phone 2 Pro ఫీచర్లు, డిజైన్, మల్టీ కస్టమైజేషన్‌తో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక మిగతా పూర్తి వివరాలు అధికారిక లాంచ్ రోజు వెల్లడి కానున్నాయి.