No Sugar Problem: 15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే కలిగే ఆరోగ్యానికి మంచిదా.. చెడా.. తెలుసుకోండి..

Written by RAJU

Published on:

No Sugar Problem: 15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే కలిగే ఆరోగ్యానికి మంచిదా.. చెడా.. తెలుసుకోండి..

స్వీట్లు, పేస్ట్రీలు వంటి అనేక రకాల తీపి పదార్థాలున్నాయి. కొంతమందికి స్వీట్స్ పేరు వింటే చాలు నోరు ఊరుతుంది. అయితే అతిగా తీపి తినడం ఆరోగ్యానికి హానికరం. ఇది బరువు పెరగడం, మధుమేహం, అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కనుక స్వీట్లను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడానికి సరైన ఆహారం, జీవనశైలిని అవలంబిస్తున్నారు. టీలో తక్కువ చక్కెర వేసుకోవడం, తక్కువ స్వీట్లు తినడం వంటి అలవాట్లు చేసుకోవాలి. అయితే మీరు 15 రోజులు తీపి పదార్థాలు తినకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.

15 రోజులు స్వీట్లు మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఢిల్లీలోని బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంటర్నల్ మెడిసిన్, ఇన్ఫెక్షన్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ అంకిత్ బన్సాల్ మాట్లాడుతూ.. 15 రోజుల పాటు స్వీట్లు మానేయడం వల్ల శరీరంపై అనేక సానుకూల ప్రభావాలు ఉంటాయని చెప్పారు. 15 రోజుల పాటు చక్కెర లేదా తీపి పదార్థాలను మానేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి మొదట స్థిరంగా ఉండడం మొదలవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. అదనపు కేలరీల తీసుకోవడం తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చర్మానికి కూడా మంచిది, మొటిమలు, నీరసాన్ని తగ్గిస్తుంది. చక్కెర వల్ల కలిగే ఆకస్మిక డోపమైన్ స్పైక్‌లు ఆగిపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది.

15 రోజులు స్వీట్లు మానేయడం వల్ల కలిగే నష్టాలు

స్వీట్లు మానేసిన తొలి రోజుల్లో కొంతమందికి తలనొప్పి, చిరాకు, స్వీట్లు తినాలనే కోరికలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తీపి పదార్థాలను పూర్తిగా దూరం పెట్టవద్దు. బదులుగా స్వీట్లను పరిమిత పరిమాణంలో లేదా సహజ వనరులతో కలిపి తీసుకోవాలి. మొత్తం మీద 15 రోజులు స్వీట్లు తినకుండా ఉండటం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. ఆరోగ్యంలో అనేక మార్పులు కనిపిస్తాయి.

చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, చక్కెర మిఠాయి, ఖర్జూరం వంటివి తినవచ్చు. అయితే మీకు డయాబెటిస్ ఉంటే పరిమిత పరిమాణంలో తినాలన్నా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, తగ్గడం రెండూ ఆరోగ్యానికి హానికరం. అదే సమయంలో ఎవరైనా సరే పేస్ట్రీలు, స్వీట్లు, కొన్ని తీపి పదార్థాలు తినవద్దు. డయాబెటిస్ లేని వారు కూడా.. వీటిని అప్పుడప్పుడు పరిమిత పరిమాణంలో తినడం సరైందే.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights