దేశ దిశ

No Communalism, No Kashmir-Like Assaults In Tamil Nadu: CM MK Stalin

No Communalism, No Kashmir-Like Assaults In Tamil Nadu: CM MK Stalin

  • తమిళనాడులోకి మతతత్వం, ఉగ్రవాదం చొరబడదు..
  • జమ్మూ కాశ్మీర్ లో జరిగినట్లు తమిళనాడులో జరగనివ్వం..
  • ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి ఇప్పటి వరకు ప్రధాని మోడీ వెళ్లలేదు: సీఎం స్టాలిన్
No Communalism, No Kashmir-Like Assaults In Tamil Nadu: CM MK Stalin

CM M K Stalin: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మతతత్వం వ్యాపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా సీఎం ఖండించారు. కోయంబత్తూరులో జరిగిన కార్ బాంబు పేలుడు కేసు లాంటి సంఘటనలను గుర్తు చేస్తూ.. మరోసారి ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం స్టాలిన్ తెలిపారు.

Read Also: Jaggareddy: “కేసీఆర్ అంటే నాకు గౌరవం.. కానీ”.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు అని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. కాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వ భద్రతా లోపాన్ని మేము విమర్శించలేదని పేర్కొన్నారు. ఈ ఉగ్ర దాడిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తమిళనాడు మద్దతు ఇస్తుందని చెప్పాము.. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంకా ఉగ్రదాడి జరిగిన స్థలాన్ని సందర్శించలేదనే విషయం ప్రజలకు కూడా తెలుసు అన్నారు. ఏది ఏమైనా, తమిళనాడులోకి మతతత్వం, ఉగ్రవాదం ఎప్పటికీ చొరబడదు అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నొక్కి చెప్పారు.

Exit mobile version