- నిత్యానంద మృతి వార్తలు – వాస్తవం ఏమిటి?
- కైలాస నుంచి విడుదలైన అధికారిక ప్రకటన
- నిత్యానంద వివాదాలు – పరారయిన గురువు జీవ సమాధిలోనా?

Nityananda : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడంటూ, నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊపునిచ్చాయి. అయితే, ఈ వార్తలపై కైలాస దేశం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది.
తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద, తాను పూర్తిగా సురక్షితంగా ఉన్నానని, జీవ సమాధి (సుప్తావస్థ)లో ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యానంద ప్రస్తుతం తన స్వంత ద్వీప దేశం కైలాసలో ఉంటూ, తన ధార్మిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
భారతదేశ న్యాయవ్యవస్థలో నిత్యానందపై పలు ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల కారణంగా ఆయనపై విచారణ కొనసాగుతోంది. 2019లో అకస్మాత్తుగా దేశం విడిచి వెళ్ళిపోయిన నిత్యానంద, ఆ తర్వాత తన స్వంత ద్వీపం కైలాసను స్థాపించినట్లు ప్రకటించారు. అంతేకాదు, దీన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపినట్లు చెబుతారు.
2022లోనూ నిత్యానంద మృతి చెందారని వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. తాను చనిపోలేదని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఇక, ఆయన చివరిసారిగా 2022 మహాశివరాత్రి రోజున యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యారు.
తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని అరుణాచలం ప్రాంతంలో జన్మించిన నిత్యానంద, 2002లో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. 2003లో బెంగుళూరులో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తర్వాత, దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పరిచారు. తాజా పరిణామాల నేపథ్యంలో, నిత్యానంద తన భక్తులకు ఓ ప్రకటన విడుదల చేయడం ద్వారా వారి ఆందోళన తొలగించారని చెప్పవచ్చు. ఆయన ఆరోగ్యంగా, కైలాసలో ఉంటూ తన మిషన్‌ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు దక్కని చోటు!