ముఖేష్ అంబానీ దంపతులకు అత్యుత్తమ వస్తువులపై ఆసక్తి చాాలా ఎక్కువ. అలాంటి వాటిని చాలా ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. వీరు రోల్స్ రాయిస్ కార్లతో పాటు అనేక భారీ లగ్జరీ వాహనాలను వినియోగిస్తుంటారు. వీటితో పాటు భార్యాభర్తలిద్దరికీ సొంత ప్రైవేటు జెట్లు కూడా ఉన్నాయి. ముఖేష్ అంబానీ –పైవేటు జెట్ విలువ 150 మిలియన్ డాలర్ల (రూ.1.261 కోట్లు). కస్టమైజ్డ్ బోయిండ్ 737 విమానాన్ని ఇలా అత్యాధునికంగా మార్పు చేశారు. నీతా అంబానీ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె సంపన్న జీవితానికి ప్రైవేటు జెట్ నిదర్శనంగా నిలుస్తుంది. ఆ జెట్ ను ఆమె 44వ పుట్టిన రోజున భర్త ముఖేష్ అంబానీ బహుమతిగా అందజేశారు. ఈ కస్టమ్ ఫిట్టెడ్ ఎయిర్ బస్ 319లో 10 నుంచి 12 మంది వ్యక్తులు అత్యంతగా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. నీతా అంబానీ అభిరుచి, ఇష్టాలకు, అవసరాలకు అనుగుణంగా దీన్ని డిజైన్ చేశారు. అత్యంత విలాసవంతమైన 5 స్టార్ సూట్ లలో మించిన సౌకర్యాలు దీనిలో ఉన్నాయి.
నీతా అంబానీ ప్రైవేటు విమానంలో అనేక అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అదరహో అనిపించే డైనింగ్ హాలు, వినోదం, గేమింగ్ కోసం లాంజ్ ఏరియా, స్కైబార్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితో పాటు జాకుజీతో కూడిన బాత్రూమ్ కలిగిన బెడ్ రూమ్, ఉపగ్రహ టెలివిజన్, ఆన్ బోర్డు వైర్ లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. విమానాలంటే ముఖేష్ అంబానీకి ఆసక్తి చాలా ఎక్కువ. ఆయన విమానాల సముదాయంలో గతేడాది బోయింగ్ 737 మాక్స్ 9 చేరింది. దేశంలోని అత్యంత ఖరీదైన విమానాల్లో ఇది ఒకటి. ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ విమానం సీఎఫ్ఎంఐ ఎల్ఈఏవీ-18 ఇంజిన్లతో పనిచేస్తుంది.
ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ గా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు. నీతాముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) వ్యవస్థాపకురాలిగా, ఐపీఎల్ క్రికెట్ ప్రాంచైజీ యజమానిగా, ఐఓసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ ఐకాన్ గా ఆమె రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె ప్రయాణాలకు కోసం కస్టమ్ ఫిట్టెడ్ ఎయిర్ బస్ ను ముఖేష్ అంబానీ బహుమతిగా అందజేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి