ABN
, Publish Date – Mar 21 , 2025 | 05:39 AM
రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

తోటపల్లి, గొట్టా బ్యారేజీ పనులు పూర్తి : నిమ్మల
అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను రెండు నెలల్లో పరిష్కరిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఆయకట్టు స్థిరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 4.02 కోట్ల ఎకరాల భూమి ఉంటే, 1.99 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉందని, దీనిలో 1.06 కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. మిగిలిన భూమికీ సాగు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 2018లో తోటపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి, రూ.41.22 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. గొట్టా బ్యారేజీ మరమ్మతులకు రూ.12.68 కోట్లు కేటాయించామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.
Updated Date – Mar 21 , 2025 | 05:39 AM