- నేడే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
- ఉదయం 9:15 గంటల నుండి 11:30 గంటల మధ్య శాసనమండలి ఆవరణలో ప్రమాణ స్వీకారం.

MLCs Oath Carmony: తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో ఈ రోజు ( ఏప్రిల్ 7న) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేటి ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల మధ్య మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైనా మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
Read Also: SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విజయం!
ఇందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్‌నాయక్ ఉండగా.. సీపీఐ తరఫున నెల్లికంటి సత్యం ప్రమాణం చేయనుండగా.. ఇక, బీజేపీ తరపున మల్కా కొమురయ్య, అంజిరెడ్డి ఉన్నారు. అయితే, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్‌రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది.