Nara Lokesh: కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం

Written by RAJU

Published on:

అమరావతి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్మరించుకున్నారు. పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను నారా లోకేష్ గుర్తుచేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. ఆ మహానీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

జ్యోతిరావు పూలే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు: హోంమంత్రి అనిత

Anitha.jpg

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను స్మరించుకున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మహనీయులు పూలే అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. పూలే బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని హోంమంత్రి అనిత సూచించారు.

సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యం : మంత్రి సవిత

Savitha.jpg

సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కొనియాడారు. శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఘన నివాళులు అర్పించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు మహనీయుడు పూలే కృషిచేశారని తెలిపారు. తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త పూలే అని అభివర్ణించారు. సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు వెంకట గురుమూర్తి, డూండీ రాకేష్, పలువురు డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన

ఫోటోషూట్లలోనే ఇదో కొత్త తరహా..

Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్‌ దౌర్జన్యం

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

Read Latest AP News And Telugu News

Updated Date – Apr 11 , 2025 | 11:38 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights