Nara Lokesh: కీలక దశకు మంత్రి లోకేష్ కేసు..

Written by RAJU

Published on:

విశాఖ: ‘సాక్షి’ (Sakshi) దినపత్రిక (newspaper)లో ఉద్దేశపూర్వకంగా రాసిన తప్పుడు కథనం (controversy)పై రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ (Minister Lokesh) న్యాయపరంగా పోరాడుతున్నారు. ఈ కేసులో గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ 12వ అడిషనల్ జిల్లా కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ (Cross-Examination) జరగనుంది. దీనికి లోకేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కానుండడంతో ఈ కేసు కీలక దశకు చేరనుంది. మంత్రి లోకేష్ తరఫున సీనియర్ న్యాయవాది కోటేశ్వరరావు, ఇతర న్యాయవాదులు హాజరవుతారు.

Also Read..: తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు..

2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి దనపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటకలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు మంత్రి లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటునుంచి ఎలాంటి వివరణ రాలేదు. తాము రాసిన కథనం ఆధారాలతోనే రాశామని, ఇందులో అసత్యమేమీలేదని నిరూపించే వివరణ ఏదీ రాలేదు. తాను పంపిన నోటీసులకు స్పందించకపోవడంతో మంత్రి లోకేష్ తన న్యాయవాదులతో పరువు నష్టం దావా వేశారు. ఈ కథనంలో చెప్పినట్లుగా ఆ రోజుల్లో తాను అసలు విశాఖలో లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు వచ్చే అతిధులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ.. తన ప్రతిష్టను మసకబార్చేందుకు చేసిన కుట్ర ఇది అని.. దీనిపై విచారించి న్యాయం చేయాలని కోర్టును కోరారు.

ఈ కేసుకు సంబంధించి గురువారం క్రాస్ ఎగ్జామినేషన్ జరిగనుంది. అది ఎక్కువ సేపు పట్టే అవకాశాలు తక్కువే. ఆ తర్వాత ఏంటి.. తీర్పు ఎలా ఉంటుంది.. తీర్పు ఎవరిపై ఉంటుంది.. ఒక వేళ తీర్పు లోకేష్‌వైపు ఉంటే.. సాక్షి పత్రిక యాజమాన్యాన్ని పరువు నష్టం పరిహారం కింద డబ్బులు చెల్లించమని ఆదేశిస్తారా.. ఇలా ఈ కేసు తీర్పుపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

కాగా రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ బుధవారం రాత్రి విశాఖపట్నం వచ్చారు. రాత్రి 7.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. గురువారం ఉదయం 10.15 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కోర్టుకు వెళతారు. తనపై తప్పుడు కథనం ప్రచురించిందని ‘సాక్షి’ దినపత్రికపై ఆయన గతంలో పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుని విజయవాడకు వస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు బంగారం, వెండి ధరలు…

రుణగ్రహీతలకు ఊరట

For More AP News and Telugu News

Updated Date – Apr 10 , 2025 | 09:04 AM

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights