NABARD Chairman Shaji KV Meet Telangana CM Revanth Reddy

Written by RAJU

Published on:

  • సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డ్ ఛైర్మన్ షాజీ కేవీ భేటీ..
  • తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని కోరిన సీఎం రేవంత్..
  • కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని కోరిన నాబార్డ్ ఛైర్మన్..
NABARD Chairman Shaji KV Meet Telangana CM Revanth Reddy

NABARD: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలన్నారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్స్ నిధులు మార్చ్ 31వ తేదీ లోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Read Also: Chiranjeevi : వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్

ఇక, నాబార్డు పరిధిలోని స్కీములన్నింటినీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలన్నారు సీఎం రేవంత్.. అలాగే, స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సూచించారు. కొత్త గ్రామ పంచాయతీలకు రూరల్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డ్ ఛైర్మన్ షాజీ కేవీ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యె మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.

Subscribe for notification