
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది. ఇది టీంకి కలిసి రాకపోవచ్చని క్రికెట్ నిపుణులు అంచనా..
READ MORE: Municipal Chairman: అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర.. మున్సిపల్ ఛైర్మన్ శాంత
జస్‌ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో గాయమై మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బుమ్రా ఆడలేదు. ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావసంలో ఉన్న బుమ్రా.. పోటీ క్రికెట్‍లోకి తిరిగి వచ్చేందుకు మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. “బుమ్రా మెడికల్ రిపోర్ట్‌లు బాగానే ఉన్నాయి. అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ కూడా పునఃప్రారంభించాడు. కానీ ఐపీఎల్ ప్రారంభ మ్యాచులలో అతడు ఆడే అవకాశం లేదు. ఏప్రిల్ మొదటి వారంలో అతడు పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.” అని ఇటీవల బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుమ్రా మ్యాచ్‌లో లేకపోవడం టీంకి మైనస్. ఈ వార్త ముంబై ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 2013 నుంచి అన్ని మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఈ పరంపరను ముగించాలని కోరుకుంటున్నారు. అంతే కాకుండా.. సీఎస్‌కే మెరుగ్గా ఆడుతుందని అంచనా. ఎందుకంటే.. ఇది వారి సొంత మైదానం.