- ఐపీఎల్ లో తలనొప్పిగా మారుతున్న అంపైరింగ్ విధానం..
- ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా ప్రవర్తించడంతో వివాదం..
- ముంబైకి సపోర్టుగా పని చేస్తున్నారంటూ నెట్టింట విమర్శలు..

IPL 2025: ఐపీఎల్ 2025లో అంపైరింగ్ విధానం తలనొప్పిగా మారుతుంది. ఈ సీజన్లో సమస్య మరింత ఎక్కువైంది. బంతి బ్యాట్ కు తగలకున్నా ఔట్ ఇవ్వడం, డీఆర్ఎస్ విషయంలో అంపైర్లు కొన్ని ఫ్రాంచైజీలకు అనుకూలంగా ప్రవర్తించడం వివాదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయంలో అంపైర్లు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అవుట్ అయిన విధానంపై అంపైర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇషాన్ విషయంలో అంపైర్ ముంబై ఇండియన్స్ కి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Read Also: PM Modi: ఏపీకి మళ్లీ వస్తాను.. సీఎం చంద్రబాబుకు థ్యాంక్స్!
అయితే, తాజాగా మరోసారి డీఆర్ఎస్ డిసీషన్ వివాదాస్పదమైంది. ముంబై – రాజస్థాన్ మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మను డీఆర్ఎస్ విషయంలో కాపాడారంటూ అంపైర్ పై మండిపడుతున్నారు నెటిజన్స్. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో అంపైర్ రోహిత్ ను ఎల్‌బీగా ప్రకటించాడు. కానీ, రోహిత్ చివరి క్షణంలో రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ చేయడంతో బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్లు తేలింది. దీంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక, సమస్య ఎక్కడ వచ్చిందంటే.. డీఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం 15 సెకన్లలోపే రివ్యూ తీసుకోవాలి. అయితే, ఈ మ్యాచ్ లో రోహిత్ రివ్యూ కోరినప్పుడు టైమర్ 0 సెకన్లు చూపించింది. అంటే రివ్వ్యూ టైం కంప్లీట్ అయినా అంపైర్లు రోహిత్ రివ్యూ ఓకే చేశారు.
Read Also: GT vs SRH: మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ రేసులో ఎస్ఆర్ఎచ్ నిలుస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న జీటి
కాగా, ఈ డ్రామా తర్వాత రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. 53 పరుగులతో ఈ ఐపీఎల్ మరో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై టేబుల్ టాప్ లో కొనసాగుతుంది.