
ఐపీఎల్ (IPL) సీజన్ మొదలైతే చాలు, పాత రికార్డులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రతి సీజన్‌లో ఉన్న రికార్డులు బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కానీ, కొన్ని అరుదైన ఫీట్‌లను అందుకోవడం మాత్రం అంత తేలిక కాదు. తాజా డకౌట్ తో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌట్లు అయిన గ్లెన్ మాక్స్ వెల్ సరసన చేరాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఐపీఎల్ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా.. రోహిత్ శర్మ సైతం 18 సార్లు ఏమీ పరుగులు చేయకుండా చెత్త రికార్డును నెలకొల్పలాడు. వీరిద్దరితో సమానంగా మరో ప్లేయర్ కూడా ఉన్నాడు. అతడే దినేష్ కార్తీక్. దినేష్ కార్తిక్ కూడా ఇప్పటి వరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు. వీరి తర్వాతి స్థానంలో పియూష్ చావ్లా (16), సునీల్ నరైన్ (16) ఉన్నారు.
READ MORE: Water from air: గాలి నుంచి నీరు తయారు చేస్తున్న భారతీయ సంస్థ.. ఎలా సాధ్యం..?
కాగా.. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన ముంబైకి పవర్ ప్లేలో మంచి ఆరంభం లభించలేదు. పవర్ ప్లే లో ముంబై ఇండియన్స్ కు పరుగులు వచ్చాయి. కానీ.. తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. కీలక బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నారు. మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో ఖలీల్ అహ్మద్ వేసిన ఐదో బంతికినాలుగో బంతికి రోహిత్ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. మూడు బంతులు ఎదరుకున్న రోహిత్ నాలుగో బంతికి ఔటై మరో చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.