
రానికి చెందిన ప్రముఖ సంస్థ ముకుంద తమ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు ప్రత్యేకంగా వాహనాలను బహుకరించింది. ఈ సందర్భంగా 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, ఇద్దరు ఉద్యోగులకు హై-రేంజ్ కార్లు అందజేశారు.
బేగంపేటలో నిర్వహించిన వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ నికిత రెడ్డి వాహనాలను ఉద్యోగులకు అందించారు. అలాగే, ఉద్యోగుల కృషిని గౌరవిస్తూ ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను బహుమతిగా ఇచ్చారు.
వేడుకల్లో ముకుంద యాజమాన్యం ఉద్యోగులను ప్రత్యేకంగా సన్మానించగా, చైర్మన్ నరసింహారెడ్డికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ, “ఉద్యోగులు మా కుటుంబ సభ్యుల వంటివారు. వారి శ్రమతోనే సంస్థ అభివృద్ధి సాధిస్తోంది. వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. వేడుకలలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు చేసుకున్నారు, పాటలు పాడుతూ, నృత్యాలతో ఉల్లాసంగా గడిపారు.