
ఆర్‌సీబీ చేతిలో చెన్నై ఓటమికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలలో ఒకటి ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీని గురించి ఇర్ఫాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. చెన్నైకి పూర్తి అనుకూలంగా ఉన్న పిట్‌లో 17 సంవత్సరాల తర్వాత ఆర్‌సీబీ గెలవడం గమనార్హం. సీఎస్‌కే ఓటమి తర్వాత అభిమానులు చాలా కోపంగా ఉన్నారు.
READ MORE: MLA Kolikapudi: టీడీపీలో కాకరేపుతున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్..
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో శివం దూబే ఔటవగా, రవిచంద్రన్ అశ్విన్ మైదానంలోకి రావడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిపై ప్రేక్షకులతో పాటు, క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్‌లో పోస్టు్‌లో “ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని నేను ఎప్పుడూ సమర్థించను. ఇది జట్టుకు ఏమాత్రం మంచిది కాదు.” అని రాసుకొచ్చారు. ఇర్ఫాన్ పఠాన్ పెట్టిన ఈ పోస్ట్ పై చాలా చర్చ జరిగింది. కొంతమంది వ్యాఖ్యాతలు ధోని నిర్ణయాన్ని సమర్థించారు. మరి కొంతమంది ధోని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
READ MORE: Earthquakes: ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదు
ఐపీఎల్ 2025లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. మరోవైపు చెపాక్ స్టేడియంలో ఆర్సీబీకి చెత్త రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 2008లో ఈ స్టేడియంలో మ్యాచ్ గెలిచిన కోహ్లి టీమ్.. ఆ తర్వాత 16 సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెపాక్ స్టేడియం ఈ రెండు జట్లు 9 మ్యాచ్ లాడాయి. సీఎస్కే 8 గెలవగా.. ఆర్సీబీ ఒకటి మాత్రమే నెగ్గింది. తాజాగా ఈ మ్యాచ్ విజయంతో 17 ఏళ్ల వెయిటింగ్‌కు ఆర్సీబీ ఎండ్ కార్డు వేసింది.
I will never be in favour of Dhoni batting at number 9. Not ideal for team.
— Irfan Pathan (@IrfanPathan) March 28, 2025